అమ్మో.. విజ్జేశ్వరం జంక్షన్‌!

ABN , First Publish Date - 2021-06-20T05:43:27+05:30 IST

విజ్జేశ్వరం సెంటర్‌ ప్రమాదాల నిలయంగా మారింది.

అమ్మో.. విజ్జేశ్వరం జంక్షన్‌!
విజ్జేశ్వరం జంక్షన్‌లో భారీ గోతులు

హడలిపోతున్న వాహన చోదకులు

గోతుల రోడ్డుతో భయం భయంగా ప్రయాణాలు

అధికారులు పట్టించుకోవాలని వినతి

నిడదవోలు, జూన్‌ 19: విజ్జేశ్వరం సెంటర్‌ ప్రమాదాల నిలయంగా మారింది. కొవ్వూరు, ధవళేశ్వరం నుంచి నిడదవోలు వచ్చే వాహనదారులు విజ్జేశ్వరం సెంటరు నుంచే రావాలి. అలాగే నిడదవోలు నుంచి కొవ్వూరు వెళ్ళాలన్నా, ధవళేశ్వరం వెళ్ళాలన్నా ప్రధాన జంక్షన్‌ విజ్జేశ్వరం. ఈ సెంటర్‌ అంతా భారీ గోతులతో ప్రమాదకరంగా మారింది. వాహనదారులు పగటిపూటే ఈ మార్గంలో ప్రయాణించాలంటే నానా ఇబ్బందులు పడతారు. రాత్రిపూట చెప్పనక్కర లేదు. వర్షం వచ్చిందంటే  గోతుల నిండా నీరు నిండి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. ప్రతి రోజూ మంత్రుల నుంచి జిల్లా ఉన్నతాధికార్ల వరకు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు.  అయినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  తక్షణం రోడ్డుకు మరమ్మతులు నిర్వహించి ప్రమాదాలు జరగకుండా  చూడాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2021-06-20T05:43:27+05:30 IST