నాన్‌ లే అవుట్ల జాతర

ABN , First Publish Date - 2022-01-24T06:16:12+05:30 IST

తాడేపల్లిగూడెం మున్సిపాలిటిలో విలీనమవుతున్న గ్రామాలే లక్ష్యంగా రియల్టర్లు దందాకు తెరలేపారు.

నాన్‌ లే అవుట్ల జాతర
శశి కళాశాల సమీపాన నూతనంగా వేస్తున్న నాన్‌ లేఅవుట్‌

ఇబ్బడిముబ్బడిగా పూడికలు  

 విలీన గ్రామాలే లక్ష్యం

 తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 23: తాడేపల్లిగూడెం మున్సిపాలిటిలో విలీనమవుతున్న గ్రామాలే లక్ష్యంగా రియల్టర్లు దందాకు తెరలేపారు. పట్టణంలోని బడా రియల్టర్ల దగ్గర నుంచి చోటా రియల్టర్ల వరకూ ఈ ప్రాం తాల్లోనే పాగా వేసి పూడికలు నిర్వహిస్తున్నారు. ఆనక హద్దుల పాతి తక్కువ ధరకు స్థలం కొనుగోలు చేసుకుని సొంత ఇంటిని కట్టుకోవాలనుకునే మధ్య తరగతి వారికి వల వేస్తూ జేబు నింపుకుంటున్నారు. ముఖ్యంగా తాడేపల్లిగూ డెం మునిసిపాలిటీలో విలీనమయ్యే పడాల, కుంచనపల్లి, కొండ్రుప్రోలు, ఎల్‌. అగ్రహారం, ప్రత్తిపాడు గ్రామాల్లో ఈ తరహా నాన్‌ లేఅవుట్‌లు దర్శనమి స్తున్నాయి. ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకు పొలాలను కొనుగోలు చేసి కనీసం నిబంధనలు పాటించకుండా స్థలాల పూడిక చేపడుతున్నారు. అనంతరం మధ్య తరగతి కుటుంబాల వారిని ఆకర్షించేలా బ్రోచర్‌లు, కరపత్రాలు పంచు తున్నారు. వారు కొనుగోలు చేసిన తరువాత అధి కారులు  ఇళ్ల నిర్మాణానికి అనుమతి లేదంటూ బాంబు పేల్చడం పరిపాటిగా మారింది. 

అధికారుల అండతోనే.. 

ఆ నాన్‌ లేఅవుట్‌ల అంశం స్థానిక అధికారుల కనుసన్నల్లోనే జరుగుతు న్నట్టు ప్రచారం సాగుతోంది. వారికి సమర్పించాల్సిన తాయిలాలు అందించిన తర్వాతే పూడిక కార్యక్రమం మొదలవుతుందని, అది తెలియక కొనుగోలు చేసిన అమాయక ప్రజలు ఇళ్ల నిర్మాణం కోసం నానా పాట్లు పడక తప్పడం లేదని పలువురు వాపోతున్నారు. ఇలాంటి నాన్‌ లేఅవుట్‌లు కొనుగోలుచేసి చాలా మంది ఇల్లు కట్టలేక, వదులుకోలేక అవస్థలు పడుతున్న  సందర్భాలు చాలా ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నిర్వ హించిన వార్డు బాటలో ఇలాంటి నాన్‌లేఅవుట్‌ అంశమే బాధితులు ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. దానికి సంబంధించిన అనుమతులు ఇప్పించాలని వేడుకున్నా రు. తమకు మౌలిక వసతులు కల్పించడంలేదని వాపోయారు. నాన్‌ లే అవుట్‌లు పూడ్చారు అని తెలిసినా అధికారుల చర్యలు కనిపించడంలేదు. గతంలో నాన్‌ లే అవుట్‌ల ప్రాంతాల్లో వేసిన రోడ్లు తవ్వి ప్రజలకు ఆ నాన్‌ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలు చేయరాదని హెచ్చరికలు తెలియజేసేవారు. ఇప్పుడు అలాంటి చర్యలు లేవు. తాజాగా కొండ్రుప్రోలు పరిధిలో వేసిస ఓ నాన్‌ లే అవుట్‌ వద్ద మున్సిపాలిటీ చిన్న బోర్డు పెట్టి చేతులు దులుపుకుంది.  దాన్ని ఏ రాత్రిపూటో తీసి పారేస్తే అది అనుమతుల లేని లేఅవుట్‌ అని  మూడో కంటికి కూడా తెలియదు. 

కోట్లలో వ్యాపారం... 

రియల్టర్లు తమకు లాభాలందించే ప్రాంతాల్ని ఎంచుకుని వాటి కొనుగో లుకు రైతులతో మాట్లాడి కొంత అడ్వాన్స్‌తోనే పొలాల్ని పూడిక చేస్తున్నారు. ఆనక ఆ లే అవుట్‌లను విక్రయించి సొమ్ము తీసుకుని నిష్క్రమిస్తున్నారు.

Updated Date - 2022-01-24T06:16:12+05:30 IST