ఇండిగోను ఢీకొన్న స్పైస్‌జెట్‌ నిచ్చెన

ABN , First Publish Date - 2020-06-07T08:23:53+05:30 IST

తుపాను ప్రభావంతో ముంబై విమానాశ్రయాన్ని బలమైన ఈదురుగాలులు తాకాయి. వాటి తీవ్రతకు.. పార్క్‌ చేసి ఉన్న స్పైస్‌జెట్‌ విమానం నుంచి విడిపోయిన నిచ్చెన (స్టెప్‌ ల్యాడర్‌) పక్కనే

ఇండిగోను ఢీకొన్న స్పైస్‌జెట్‌ నిచ్చెన

ముంబై, జూన్‌ 6: తుపాను ప్రభావంతో ముంబై విమానాశ్రయాన్ని బలమైన ఈదురుగాలులు తాకాయి. వాటి తీవ్రతకు.. పార్క్‌ చేసి ఉన్న స్పైస్‌జెట్‌ విమానం నుంచి విడిపోయిన నిచ్చెన (స్టెప్‌ ల్యాడర్‌) పక్కనే ఉన్న ఇండిగో విమానాన్ని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇండిగో విమానం కుడివైపు రెక్క భాగం, ఇంజిన్‌ కవర్‌ పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభమైందని విమానాశ్రయవర్గాలు వెల్లడించాయి. తుపానుపై వాతావరణ శాఖ నుంచి ఎలాం టి ముందస్తు హెచ్చరికలు వెలువడలేదని తెలిపాయి. లాక్‌డౌన్‌తో పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తుండటంతో.. సింహభాగం విమానాలు పార్కింగ్‌ ప్రదేశాల కే పరిమితమయ్యాయని పేర్కొన్నాయి. దీంతో.. పార్కిం గ్‌ ప్రాంతమంతా కిక్కిరిసిపోయిందని, అదృష్టవశాత్తూ తుపాను గాలులతో మిగతా విమానాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని వివరించాయి. 

Updated Date - 2020-06-07T08:23:53+05:30 IST