ఇసుక కొరతతో ఆగిన నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-04-22T05:18:34+05:30 IST

ప్రస్తుత కాలంలో గృహ నిర్మాణానికి కానీ ప్రభుత్వ నిర్మాణాలకు కానీ శ్లాబు వేయాలంటే తెల్ల ఇసుక తప్పనిసరి. కానీ ఆ ఇసుక దాదాపు నెలరోజులుగా రవాణా నిలిచిపోవడంతో మండలంలో ప్రభుత్వ భవన నిర్మాణాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.

ఇసుక కొరతతో ఆగిన నిర్మాణాలు

కార్మికులకు తగ్గిన పనులు

తెల్ల ఇసుక కోసం ఎదురుచూపులు

పోరుమామిళ్ల, ఏప్రిల్‌21: ప్రస్తుత కాలంలో గృహ నిర్మాణానికి కానీ ప్రభుత్వ నిర్మాణాలకు కానీ శ్లాబు వేయాలంటే తెల్ల ఇసుక తప్పనిసరి. కానీ ఆ ఇసుక దాదాపు నెలరోజులుగా రవాణా నిలిచిపోవడంతో మండలంలో ప్రభుత్వ భవన నిర్మాణాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. కొత్తగా గృహాలు నిర్మించుకునేవారు ఇసుక కోసం ఎదురు చూస్తున్నారు.

సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి ఇసుక అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక భవన నిర్మాణ రంగాలపై ఆఽధారపడి జీవించే కార్మికులకు చాలా మంది ఉపాధి కరువైంది. పోరుమామిళ్ల మండలానికి సంబంధించి గతంలో కస్తూర్బాగాంధి బాలికల పాఠశాల సమీపంలో ఇసుక డంపింగ్‌ ను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం ఆ డం పింగ్‌లో ఉన్న ఇసుక అంతా ఖాళీ అవడం తో ఈ ప్రాంతంలో ఇసుక కొరత ఏర్పడింది. ఇసుక కావాలంటే గతంలో ఆనలైన ద్వారా డబ్బులు చెల్లించి రవాణా చేయించుకునేవా రు. కానీ నెలరోజులుగా ఇసుక రవాణా కాక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు.

బ్లాక్‌ లో కొనాలంటే సామాన్యులు కొనలేని పరిస్థి తి ఏర్పడింది. దీంతో ఎర్ర ఇసుకకు కూడా గిరాకీ ఏర్పడింది. మండలంలో సచివాలయ భవన నిర్మాణాలకు ఇసుక కొరత ఏర్పడిం ది. ప్రభుత్వ భవనాలకే ఇసుక కొరత ఏర్పడితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారు లు స్పందించి అదనపు క్వారీలను గుర్తించి ఇసుక సరఫరా చేస్తే అటు భవన నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులకు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించినట్లవుతుంది. ప్రభుత్వ భవ న నిర్మాణాలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది.

పోరుమామిళ్ల ప్రాంతంలో బేల్దారులు వెయ్యి మంది ఉంటారని అంచనా. ఇసుక కొరత వల్ల వీరిలో చాలా మందికి ఉపాధి కరువై ఆందో ళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఇసుక కొరత తీర్చి అటు ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇటు పేదలు, కార్మికుల అవసరాలు తీర్చాలని కోరుతున్నారు.

అధికారుల దృష్టికి తీసుకెళ్లాం

మండలంలో సచివాలయాల నిర్మా ణాలకు ఇసుక కొరత ఉంది. ప్రస్తు తం ఇసుక క్వారీలకు నీరు చేరడంతో అదనపు క్వారీల కోసం జిల్లా అధికారులు పరిశీలిస్తున్నారని, వచ్చిన తరువాత ఇసుక వస్తే మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తాం.

సుబ్రహ్మణ్యం, పీఆర్‌ఏఈ

Updated Date - 2021-04-22T05:18:34+05:30 IST