ఆగిన భూ రిజిస్ట్రేషన్లు

ABN , First Publish Date - 2022-07-04T06:26:19+05:30 IST

జిల్లావ్యాప్తంగా అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రెండ్రోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి.

ఆగిన భూ రిజిస్ట్రేషన్లు
జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయం

లబోదిబోమంటున్న రియల్టర్లు

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 3: జిల్లావ్యాప్తంగా అన్ని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రెండ్రోజులుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారి నుంచి ఉత్తర్వులు అందడంతో శుక్ర, శనివారాలు జరగాల్సిన వందలాది రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అనధికార లేఅవుట్లకు మూడు నెలల క్రితమే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అనధికార లేఅవుట్లను నిషేధిత జాబితాలో ఉంచేందుకు డైరక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌కు అధికారం లేదంటూ కోర్టు స్పష్టం చేయడంతో మళ్లీ రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నాయి. కాగా శుక్రవారం రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి అందిన అనధికార ఉత్తర్వుతో డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లను సబ్‌ రిజిస్ట్రార్లు నిలిపివేశారు. దీంతో 2021 నుంచి వేసిన కొత్త వెంచర్‌దారులు, కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. అనధికారికంగా వచ్చిన ఉత్తర్వులు ఏమిటో సబ్‌ రిజిస్ట్రార్లు చెప్పడం లేదు. దీనిపై స్పష్టత రాకుంటే సోమవారం కూడా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయే అవకాశం ఉందని ఒక డాక్యుమెంట్‌ రైటర్‌ తెలిపారు.


Updated Date - 2022-07-04T06:26:19+05:30 IST