Abn logo
Mar 30 2020 @ 07:02AM

కరోనా షేమింగ్‌పై ప్రముఖ టీవీస్టార్ సంచలన వ్యాఖ్యలు

మా పైలెట్ అన్నయ్యకు కరోనా సోకలేదు...

సోషల్ మీడియాలో టీవీ స్టార్ పోస్టు

న్యూఢిల్లీ : ప్రముఖ టీవీ స్టార్ కరోనా షేమింగ్‌పై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ టీవీ నటి అయిన దివ్యాంక త్రిపాఠి సోదరుడు వృత్తిరీత్యా విమాన పైలెట్. విమాన పైలెట్ అయిన తన సోదరుడికి, తన తల్లికి కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో సోషల్ మీడియాలో కరోనా షేమింగ్ చేయడం చాలా ప్రమాదకరమైన చర్య అని దివ్యాంకా త్రిపాఠి ఆరోపించారు.


పైలెట్ అయిన సోదరుడికి కరోనా వైరస్ సోకలేదని, కానీ అతనే స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలో ఉన్నాడని దివ్వాంకా స్పష్టం చేశారు. ‘‘నా సోదరుడికి ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేకున్నా ముందుజాగ్రత్త చర్యగా ఇతర విమానయాన ఉద్యోగుల్లాగే అతను కూడా హోంక్వారంటైన్‌లో ఉన్నాడు. కరోనావైరస్ షేమింగ్ ఆపండి, మనం మనుషులుగా మానవత్వాన్ని కోల్పోకండి’’ అని దివ్యంకా త్రిపాఠి తన ఇన్ స్టాగ్రాంలో  ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు.


‘‘ కరోనా ప్రబలుతున్న ప్రస్థుత తరుణంలో నా తండ్రి తన జీవితాన్ని పణంగా పెడుతూ మెడికల్ స్టోరులో ప్రజలకు ఔషధాలు అందిస్తున్నారు, నా సోదరుడు విమాన పైలెట్ గా ప్రభుత్వ ఆదేశాల మేర ధైర్యంగా విమానాలను నడుపుతూ చాలామంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నాడు. ఇలా సేవలందిస్తున్న వారిని గౌరవంగా ఉండనివ్వండి కరోనా ప్రబలుతున్న ఆపత్కాలంలో ప్రజలకు సేవ చేస్తున్న యోధులకు గౌరవం ఇవ్వండి, కరోనా షేమింగ్ చేయొద్దు’’ అని దివ్వాంకా త్రిపాఠి తన పోస్టులో కోరారు. 

Advertisement
Advertisement
Advertisement