పంట నూర్పిడి కల్లాలు పురోగతిలోకి తేవాలి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-01-21T06:15:22+05:30 IST

వచ్చే వారం నాటికి ప్రతీ మండలంలో 50 పంట నూర్పిడి కల్లాలు పురోగతిలోకి తేవడంతో పాటు 25పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు.

పంట నూర్పిడి కల్లాలు పురోగతిలోకి తేవాలి : కలెక్టర్‌
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ జీవన్‌పాటిల్‌

నల్లగొండ టౌన్‌, జనవరి 20 : వచ్చే వారం నాటికి ప్రతీ మండలంలో 50 పంట నూర్పిడి కల్లాలు పురోగతిలోకి తేవడంతో పాటు 25పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌ నుంచి జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీవో, ఏపీవోలు, ఈసీలు, ఏడీఏలు, ఏవోలు, ఎఈవోలతో వీడియో కార్ఫరెన్స్‌ నిర్వహించారు. మండలాల వారీగా పంట కల్లాలు, పల్లె ప్రకృతి వనం, లేబర్‌ రిపోర్టు, నర్సరీల పురోగతిపై సమీక్షించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పల్లె ప్రగతి అవార్డుల కోసం వచ్చిన నామినేషన్లను సంబంధిత తహసీల్దార్లు తనిఖీ చేసి రెండు రోజుల్లో రిపోర్టు అందించాలన్నారు. ఉపాధి హామీ పనికి ఎక్కువ మంది కూలీలు హాజరయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 26లోపు బ్యాగ్‌ ఫిల్లింగ్‌, సీడ్‌ సోయింగ్‌, ప్రైమరీ బెడ్‌ టు 100శాతం పూర్తి చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, డీఆర్‌డీవో శేఖర్‌రెడ్డి, జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, డీఏవో శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:15:22+05:30 IST