కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి..!

ABN , First Publish Date - 2020-06-09T16:42:13+05:30 IST

మూత్రపిండాల్లో రాళ్లను హోమియో మందులతో కరిగించే వీలుంది. మూత్రాశయం, మూత్రనాళం... ఇలా మూత్రపిండాల్లో

కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయి..!

ఆంధ్రజ్యోతి (09-06-2020): మూత్రపిండాల్లో రాళ్లను హోమియో మందులతో కరిగించే వీలుంది. మూత్రాశయం, మూత్రనాళం... ఇలా మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కడ ఏర్పడినా, వాటిని కరిగించడానికి తోడ్పడే సమర్థమైన హోమియో మందులు ఇవే!


బెర్బేరిస్‌ వల్గారిస్‌: దీన్ని మదర్‌ టింక్చర్‌ రూపంలో వాడి మూత్రపిండాలకు సంబంధించిన ఏ రకానికి చెందిన రాయినైనా కరిగించే వీలుంది.


లైకోపోడియం: కుడివైపు మూత్రపిండంలో రాళ్లను కరిగించడంలో దిట్ట ఇది. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు నొప్పి తగ్గే లక్షణం ఉన్నవారికి ఈ మందు తోడ్పడతుంది.


హాడ్రాంజే ఆర్బొరెసెన్స్‌: ఈ మందుకు ‘స్టోన్‌ బ్రేకర్‌’ (రాళ్లను పగలగొట్టేది) అని పేరు. ఈ మందు మూత్రనాళం, మూత్రాశయాల్లో రాళ్లను నలుగగొట్టి, మూత్రం ద్వారా వాటిని బయటకు వెళ్లేలా చేయగలదు. 


సర్సపరిల్లా: మూత్రంలో ఇసుకను పోలిన రాళ్లకు ఇది దివ్యమైన ఔషధం. 


కాంథారిస్‌ వెసికటోరియా: మూత్రవిసర్జన చేసిన ప్రతిసారీ విపరీతమైన మంట ఉంటే, ఈ మందు ఎంచుకోవాలి. మూత్రవిసర్జనకు ముందు, విసర్జన సమయంలో తట్టుకోలేనంత మంట ఉన్నవారికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది.

Updated Date - 2020-06-09T16:42:13+05:30 IST