ప్రజారోగ్యం బలోపేతానికి కృషి

ABN , First Publish Date - 2021-06-18T04:59:37+05:30 IST

ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న వైఎస్సార్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌కు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు.

ప్రజారోగ్యం బలోపేతానికి కృషి
శిలాఫలకాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

కలెక్టర్‌ చక్రధర్‌బాబు 

వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌కు శంకుస్థాపన

నెల్లూరు(వైద్యం), జూన్‌ 17 : ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కలెక్టర్‌ చక్రధర్‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న వైఎస్సార్‌ అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌కు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి పంచాయతీలో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ లను అందుబాటులోకి తెస్తోందని, ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్‌తోపాటు ఏరియా ఆసుపత్రులు, సీహెచ్‌సీ, పీహెచ్‌సీలలో ఆధునిక వైద్య పరికరాలను సమకూరుస్తోందని చెప్పారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలను తప్పని సరిగా పాటించాలన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ జీజీహెచ్‌ ప్రాంగణంలో రూ.80 లక్షలతో నూతన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ దినేష్‌కుమార్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ రాజ్యలక్ష్మి, వైసీపీ నేత మురళీకృష్ణ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

వ్యాక్సినేషన్‌ కేంద్రం ప్రారంభం

నగరంలోని కస్తూరిదేవి ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు గురువారం వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 8.48 లక్షల మందికి కరోనా టీకా వేసినట్లు చెప్పారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సిన్‌ వేస్తున్నారని ఫత్తేఖాన్‌పేట, టెక్కేమిట్ట వంటి ప్రాంతాల వారి కోసం కస్తూరిదేవి స్కూల్‌లో వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ గణేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:59:37+05:30 IST