కడుపు మాడ్చుకుని.. రేషన కోసం తిరిగి..

ABN , First Publish Date - 2021-06-13T06:42:10+05:30 IST

పండు వయసులో నాలు గు మెతుకుల కోసం ఈ తల్లి కష్టం కన్నీళ్లు నింపిం ది. అందులోనూ ఒంటరి వృద్ధురాలు కావడం... రెండు నెలలుగా రేషన సరుకులు అందక కడుపు మాడ్చుకుంటోంది.

కడుపు మాడ్చుకుని.. రేషన కోసం తిరిగి..
సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలు రమీజా

సొమ్మసిల్లిన వృద్ధురాలు


యాడికి, జూన 12: పండు వయసులో నాలు గు మెతుకుల కోసం ఈ తల్లి కష్టం కన్నీళ్లు నింపిం ది. అందులోనూ ఒంటరి వృద్ధురాలు కావడం... రెండు నెలలుగా రేషన సరుకులు అందక కడుపు మాడ్చుకుంటోంది. స్థానిక సిండికేట్‌ బ్యాంకు కాలనీలో నివాసముంటున్న ఈఒంటరి వృద్ధురాలి పే రు రమీజా. వయస్సు ఏడు పదుల పైమాటే. ఆమె కు రెండు నెలలుగా రేషన సరుకులు అందక.. వేరే ఆసరా లేక కడుపు మాడ్చుకుంటోంది. కాలనీకి వ చ్చే ఎండీయూ ఆపరేటర్‌ కూడా కనికరం చూపలే దు. నీ రేషనకార్డు నా పరిధిలో లేదంటూ బియ్యం ఇవ్వకుండా వెనక్కు పంపాడు. వృద్ధురాలికి బి య్యం కార్డు ఉన్నా... ఎండీయూ ఆపరేటర్‌ ఆ కాలనీకి రాడు. దారిన పోయే వారి సాయంతో ఎండీయూ ఆపరేటర్‌కు ఫోనచేయించింది. ‘నేను ఫలానా చోట ఉన్నా. వచ్చి తీసుకొని పొమ్మనండి’ అం టూ ఆపరేటర్‌ సమాధానం. అతను ఉండే కిలోమీటరు దూరానికి పండు వయసులో కాళ్లీడ్చుకుంటూ వెళ్లే సరికి మరొకచోట ఉన్నానంటాడు ఆపరేటర్‌. ఇలా రెండు నెలలుగా వృద్ధురాలికి రేషన అందక కడుపు కాల్చుకుంటోంది. శనివారం కూడా రేషన సరుకుల కోసం తిరిగి... తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది. అక్కున చేర్చుకునే వారు లేక... కాలే కడుపుతో కన్నీళ్లే ఆమె కష్టానికి సమాధానమయ్యాయి. మండల కేంద్రంలోనే ‘ఇంటి వద్దకే రేషన’ పంపిణీ తీరు అపహాస్యమై పేదల ఉసురు తీస్తోందని స్థానికులు విస్తుపో తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అనాథగా కాలం వెళ్లదీస్తున్న వృద్ధురాలి గోడు ఆలకించాలని కోరుతున్నారు. రేషన సరుకులు అందేలా చర్యలు తీసుకుని అవ్వ ఆకలి తీర్చాలని స్థానికులు వేడుకుంటున్నారు.

Updated Date - 2021-06-13T06:42:10+05:30 IST