Advertisement
Advertisement
Abn logo
Advertisement

పొట్ట ఉబ్బరిస్తే?

ఆంధ్రజ్యోతి(08-06-2021)

పొట్ట బిర్రుగా మారి, అసౌకర్యాన్ని కలిగించే సమస్య పొట్ట ఉబ్బరం. జీర్ణ వ్యవస్థలో అవసరానికి మించి వాయువులో చేరుకోవడంతో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ ఇబ్బంది నుంచి ఉపశమనం దక్కాలంటే ఈ చిట్కాలు పాటించాలి.


భోజన సమయంలో ఆహారంతో పాటు ఎక్కువగా గాలిని మింగేసినా, ద్రవాలను స్ట్రాతో పీల్చుకున్నా, గబగబా భోజనం ముగించినా పొట్ట ఉబ్బరిస్తుంది. కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి.

శరీరానికి సరిపడని ఆహారం మానేయాలి. కొందరికి పాలు తాగితే పొట్ట ఉబ్బరిస్తుంది. అలా మీకు ఏ పదార్థంతో ఇబ్బంది కలుగుతుందో గమనించి, వాటిని మానుకోవాలి.

శీతల పానీయాలు తాగడం, చూయింగ్‌ గమ్‌ నమలడం, స్ట్రాతో తాగడం లాంటి అలవాట్లు పొట్ట ఉబ్బరానికి దారి తీస్తాయి. కాబట్టి ఈ అలవాట్లు మానుకోవాలి. 

డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు శరీరంలో నీరు నిల్వ ఉండిపోతుంది. దాంతో పొట్ట ఉబ్బరం తలెత్తుతుంది. కాబట్టి డీహైడ్రేషన్‌కు వీలు లేకుండా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. అయితే చల్లటి నీళ్లకు బదులుగా త్వరగా జీర్ణమయ్యేలా గోరువెచ్చని నీళ్లు తాగుతూ ఉండాలి. 


Advertisement

Health Latest newsమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...