స్టోక్స్‌ పునరాగమనం

ABN , First Publish Date - 2021-07-22T08:29:23+05:30 IST

ఫిట్‌నెస్‌ సాధించిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మళ్లీ ఇంగ్లండ్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు.

స్టోక్స్‌ పునరాగమనం

భారత్‌తో తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్‌ జట్టు

లండన్‌: ఫిట్‌నెస్‌ సాధించిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ మళ్లీ ఇంగ్లండ్‌ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఐదు టెస్ట్‌ల సిరీ్‌స లో భాగంగా భారత్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు 17 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్‌ బోర్డు ప్రకటించింది. జాతి వివక్ష ట్వీట్‌ల కారణంగా సస్పెన్షకు గురైన పేసర్‌ ఓల్లీ రాబిన్సన్‌కు, ఐదేళ్ల విరామం తర్వాత ఓపెనర్‌ హసీబ్‌ హమీద్‌కు  చోటు దక్కింది. ఆగస్టు 4 నుంచి నాటింగ్‌ హామ్‌లో తొలి టెస్ట్‌, లార్డ్స్‌లో 12 నుంచి రెండో టెస్ట్‌ జరగనుంది. 


ఇంగ్లండ్‌ జట్టు:

రూట్‌ (కెప్టెన్‌), అండర్సన్‌, స్టోక్స్‌, బెయిర్‌ స్టో, డామ్‌ బెస్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, బర్న్స్‌, బట్లర్‌, క్రాలే, శామ్‌ కర్రాన్‌, హసీబ్‌ హమీద్‌, లారెన్స్‌, లీచ్‌, ఓలీ పోప్‌, రాబిన్సన్‌, సిబ్లే, మార్క్‌ ఉడ్‌. 

Updated Date - 2021-07-22T08:29:23+05:30 IST