IPL: రాణించిన డికాక్, హుడా.. KKR ఎదుట భారీ లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-08T02:57:48+05:30 IST

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత

IPL: రాణించిన డికాక్, హుడా.. KKR ఎదుట భారీ లక్ష్యం

పూణె: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే డకౌట్‌గా వెనుదిరిగాడు. లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. ఈ సీజన్‌లో రాహుల్‌ డకౌట్ కావడం ఇది మూడోసారి. అతడి స్థానంలో వచ్చిన దీపక్ హుడా అండగా డికాక్ చెలరేగాడు. ఇద్దరూ కలిసి సమయోచితంగా ఆడుతూ జట్టును గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.


ఈ క్రమంలో డికాక్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్ధ సెంచరీ (50) పూర్తి చేసుకుని అవుటయ్యాడు. ఆ తర్వాత దీపక్ హుడా (27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు), కృనాల్ పాండ్యా (25) కూడా స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో పరుగుల వేగం మందగించింది. అయితే, మార్కస్ స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును మళ్లీ గాడిలో పెట్టాడు. 14 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 28 పరుగులు చేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు. చివర్లో జాసన్ హోల్డర్ 4 బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు చేయడంతో స్కోరు 176 పరుగులకు చేరుకుంది. కోల్‌కతా బౌలర్లలో ఆండ్రూ రసెల్‌కు రెండు వికెట్లు దక్కాయి.

Read more