నేడు ఫోకస్‌లో ఉన్న స్టాక్స్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-28T15:17:25+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను నేడు వెల్లడించనున్నందున..

నేడు ఫోకస్‌లో ఉన్న స్టాక్స్ ఏంటంటే..

Stocks in Focus : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను నేడు వెల్లడించనున్నందున బజాజ్ ఫిన్‌సర్వ్(Bajaj Finserv), డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్(Dr Reddy's Laboratories), నెస్లే ఇండియా(Nestle India), జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్(Jubilant Foodworks), ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్(SBI Life Insurance) కంపెనీల షేర్లు నేడు ఫోకస్‌లో ఉన్నాయి.


ఇవాళ ఫోకస్‌లో ఉన్న టాప్ 10 స్టాక్స్ ఏంటంటే..


టాటా మోటార్స్(Tata Motors) : చిప్ కొరత, చైనాలో కొవిడ్ 19(COVID-19) లాక్‌డౌన్ కారణంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలపై ప్రభావం చూపడంతో జూన్ త్రైమాసికంలో టాటా మోటార్స్ రూ.4,951 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని బుధవారం నివేదించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.4,450 కోట్ల ఏకీకృత నికర నష్టాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో కార్యకలాపాల ద్వారా ఏకీకృత ఆదాయం రూ.71,935 కోట్లుగా ఉంది. 


కోల్‌గేట్-పామోలివ్ : ఎఫ్‌ఎంసీజీ మేజర్ కోల్‌గేట్-పామోలివ్ ఇండియా లిమిటెడ్ బుధవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక ఫలితాలను వెలువరించింది. జూన్ త్రైమాసికంలో నికర లాభం 10.1% క్షీణించి రూ.209.67 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ రూ.233.23 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిందని కోల్‌గేట్-పామోలివ్ ఇండియా లిమిటెడ్ (CPIL) రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.


బయోకాన్: బయోటెక్నాలజీ మేజర్ బయోకాన్ బుధవారం జూన్ త్రైమాసికంలో అదిరిపోయే వృద్ధిని సాధించింది. ఏకీకృత నికర లాభం 71 శాతం పెరిగి రూ.144 కోట్లకు చేరింది. మునుపటి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.84 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొదటి త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.1,808 కోట్ల నుంచి రూ.2,217 కోట్లకు పెరిగిందని బయోకాన్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.


మంజుశ్రీ టెక్నోప్యాక్ : అడ్వెంట్ ఇంటర్నేషనల్-బ్యాక్డ్ మంజుశ్రీ టెక్నోప్యాక్ (MTL) స్లంప్ సేల్‌లో క్యాప్స్, క్లోజర్స్ తయారీదారు హితేష్ ప్లాస్టిక్‌లను కొనుగోలు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. 


టాటా స్టీల్: సమర్థవంతమైన గని నిర్వహణ కోసం డ్రోన్ ఆధారిత మైనింగ్ సొల్యూషన్స్ కోసం బెంగళూరుకు చెందిన స్టార్టప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు దేశీయ దిగ్గజం టాటా స్టీల్ బుధవారం తెలిపింది. 


IIFL ఫైనాన్స్: IIFL ఫైనాన్స్ బుధవారం జూన్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఏకీకృత నికర లాభం రూ.330 కోట్లకు 24% పెరిగిందని వెల్లడించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ గత ఏడాది కాలంలో రూ.250 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


హీరో మోటోకార్ప్(Hero MotoCorp) : ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించేందుకు అలాగే ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నందున హీరో మోటోకార్ప్ తన సప్లై చైన్ అంతటా వ్యయ ఆప్టిమైజేషన్ కోసం యాక్సెంచర్‌తో చేతులు కలిపింది. 


బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ : లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్ బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్ బుధవారం ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికంలో పన్ను తర్వాత కన్సాలిడేటెడ్ లాభంలో మూడు రెట్లు ఎక్కువ పెరిగి రూ.118.79 కోట్లుగా నమోదైంది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,293.3 లభించింది.


JK లక్ష్మి సిమెంట్: జూన్ 30తో ముగిసిన మొదటి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభంలో 15.49% క్షీణించి రూ.115.07 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ రూ.136.17 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. జెకె లక్ష్మి సిమెంట్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 


Updated Date - 2022-07-28T15:17:25+05:30 IST