Abn logo
Sep 28 2020 @ 00:53AM

స్టాక్‌ రికమండేషన్స్‌

మెక్‌డొవెల్‌-ఎన్‌(యునైటెడ్‌ స్పిరిట్స్‌ లిమిటెడ్‌): కొద్ది కాలంగా రికవరీ బాటలో సాగుతున్న ఈ షేరు గత శుక్రవారం 3 శాతానికి పైగా లాభపడి రూ.511.35 వద్ద క్లోజైంది. కచ్చితమైన స్టాప్‌లా్‌సతో ట్రేడర్లు ప్రస్తుత ధరల వద్ద పుల్‌బ్యాక్‌ ర్యాలీలో ఈ షేరును కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. రానున్న రోజులకు రూ.525-530 టార్గెట్‌ ధరతో ఈ షేరును కొనుగోలు చేయవచ్చు. రూ.499 స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 


టీసీఎస్‌ : ప్రస్తుతం నిఫ్టీ ఐటీ.. ఫిబోనకీ నిష్పత్తి జోన్‌లోకి చేరుకుంది. దీంతో ఐటీ విభాగంలోని ఈ షేర్లలో కొంతకాలంగా లాభాల స్వీకరణ కనిపిస్తోంది. టీసీఎస్‌ కూడా కొంత కరెక్షన్‌కు లోనైంది. గత శుక్రవారం ఈ షేరు 3.67 శాతం లాభంతో రూ.2,422.30 వద్ద క్లోజైంది. ప్రస్తుత పరిస్థితలను బట్టి చూస్తే రానున్న వారాల్లో ట్రేడర్లు రూ.2,330 టార్గెట్‌ ధరతో ఈ షేరును విక్రయించే విషయాన్ని పరిశీలించవచ్చు. రూ.2,482 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి. 

- సమీత్‌ చవాన్‌, చీఫ్‌ అనలిస్ట్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Advertisement
Advertisement
Advertisement