మరింత బలహీనతకు ఆస్కారం -టెక్‌ వ్యూ

ABN , First Publish Date - 2020-03-30T09:07:39+05:30 IST

నిఫ్టీ గత వారం బేరిష్‌ ట్రెండ్‌లోనే ప్రారంభమైనా తదుపరి మూడు రోజుల్లో 1500 పాయింట్ల మేరకు రికవరీ సాధించింది. అయితే శుక్రవారంనాడు మాత్రం 9000 వరకు వెళ్లి అప్రమత్తంగా క్లోజయింది. ఈ మానసిక అవధిలో సాధించిన బలమైన...

మరింత బలహీనతకు ఆస్కారం  -టెక్‌ వ్యూ

నిఫ్టీ గత వారం బేరిష్‌ ట్రెండ్‌లోనే ప్రారంభమైనా తదుపరి మూడు రోజుల్లో 1500 పాయింట్ల మేరకు రికవరీ సాధించింది. అయితే శుక్రవారంనాడు మాత్రం 9000 వరకు వెళ్లి అప్రమత్తంగా క్లోజయింది. ఈ మానసిక అవధిలో సాధించిన బలమైన కరెక్షన్‌తో అప్‌ట్రెండ్‌కు విరామం ఏర్పడినట్టు సంకేతం వెలువడింది. ప్రస్తుత పరిస్థితిలో మరింత బలహీనపడే ఆస్కారం ఉంది. కొద్ది రోజుల మైనర్‌ అప్‌ట్రెండ్‌ అనంతరం మార్కెట్‌  ఎలాంటి కన్సాలిడేషన్‌ లేకుండానే రిలీఫ్‌ ర్యాలీ సాధించింది. అయితే ప్రస్తుతం 25 డిఎంఏ కన్నా చాలా దిగువనే ఉండడం ప్రధాన ట్రెండ్‌ ఇప్పటికీ దిగువకే ఉన్నదనేందుకు సంకేతం. వీక్లీ చార్టుల ప్రకారం మాత్రం గత వారం కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ కనబరచడం మార్కెట్‌ మద్దతు తీసుకుంటుందనేందుకు సూచనగా భావించాలి. ట్రెండ్‌ రివర్సల్‌ సాధించాలంటే ఆటుపోట్లు తగ్గించుకుని పరిమిత పరిధిలోనే కదలడం అవసరం. 

బుల్లిష్‌ స్థాయిలు : రియాక్షన్‌లో పడినా స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ నిలబెట్టుకోవడానికి 8500 వద్ద తప్పనిసరిగా బలంగా క్లోజ్‌ కావాలి. ప్రధాన నిరోధం 9050. 

బేరిష్‌ స్థాయిలు : 8500 వద్ద విఫలమైతే మరింత డౌన్‌ట్రెండ్‌కు ఆస్కారం ఉంటుంది. మద్దతు స్థాయి 8300 వద్ద నిలదొక్కుకుని తీరాలి. అక్కడ కూడా విఫలమైతే మరింత దిగజారే ప్రమాదం ఉంది. ప్రధాన మద్దతు స్థాయి 8000. 


బ్యాంక్‌ నిఫ్టీ : ఈ సూచీ 19500 వద్ద మద్దతు తీసుకోలేకపోతే మరింత దిగువకు పయనిస్తుంది. ప్రధాన మద్దతు స్థాయి 19000.  

పాటర్న్‌ : 9000 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద కరెక్షన్‌ ఏర్పడవచ్చు. అలాగే ‘‘ఏటవాలుగా దిగువకు కనిపిస్తున్న రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా చాలా దిగువన ఉండడం అప్‌ట్రెండ్‌కు మరింత సమయం పట్టవచ్చుననేందుకు సంకేతం. 8000, 7500 వద్ద ‘‘అడ్డంగా కనిపిస్తున్న సపోర్ట్‌ ట్రెండ్‌లైన్లు’’ రెండున్నాయి. రెండో రేఖ వద్ద రికవరీకి ఆస్కారం ఉంది. 

ఈ సూచీ ప్రకారం తదుపరి రివర్సల్‌ బుధవారంనాడు ఉంది.


సోమవారం స్థాయిలు


నిరోధం: 8810,9050

మద్దతు : 8500, 8300

www.sundartrends.in


Updated Date - 2020-03-30T09:07:39+05:30 IST