50 వేల మార్క్ దాటిన సెన్సెక్స్!

ABN , First Publish Date - 2021-05-18T18:37:43+05:30 IST

స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు అనుగుణంగా నమోదు కావడం దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపాయి.

50 వేల మార్క్ దాటిన సెన్సెక్స్!

కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం కావడం, కంపెనీల క్యూ4 ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు అంచనాలకు అనుగుణంగా నమోదు కావడం దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నింపాయి. సోమవారం 848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఈ రోజు (మంగళవారం) కూడా అదే బాటలో పయనిస్తోంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత 50 వేల మార్క్‌ను దాటింది. నిఫ్టీ కూడా 15 వేల పైకి ఎగబాకింది. 


49,986 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ మధ్యాహ్నం 1.00 సమయానికి 620 పాయింట్లు లాభపడి 50,220 వద్ద కొనసాగుతోంది. ఇక, 15,067 వద్ద రోజును ప్రారంభించిన నిఫ్టీ మధ్యాహ్నం 1.00 సమయానికి 187 పాయింట్లు ఎగబాకింది. బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఎయిచర్ మోటార్స్, టైటాన్ కంపెనీ లాభాలను ఆర్జిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, యూపీఎల్, ఐటీసీ, కోల్ ఇండియా నష్టాలను చవిచూస్తున్నాయి. 

Updated Date - 2021-05-18T18:37:43+05:30 IST