డీలా పడిన స్టాక్ మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-05-11T17:58:30+05:30 IST

వరుసగా నాలుగు రోజుల లాభాలకు ఈ రోజు (మంగళవారం) అడ్డుకట్ట పడింది.

డీలా పడిన స్టాక్ మార్కెట్లు!

వరుసగా నాలుగు రోజుల లాభాలకు ఈ రోజు (మంగళవారం) అడ్డుకట్ట పడింది. నష్టాలతో రోజును ప్రారంభించిన రెండు ప్రధాన సూచీలు అదే బాటలో పయనిస్తున్నాయి. 49,066 వద్ద రోజును ప్రారంభించిన సెన్సెక్స్ మధ్యాహ్నం 12:15 గంటల సమయానికి 250 పాయింట్లు కోల్పోయింది. ఇక, 14,789 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టిన నిఫ్టీ మధ్యాహ్నం 12:15 గంటల సమయానికి 54 పాయింట్లు నష్టపోయింది.


ఐఓసీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్ లాభాలను ఆర్జిస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, దివీస్ ల్యాబ్స్ నష్టాలను చవిచూస్తున్నాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. దీంతో ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. మరోవైపు కోవిడ్ భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. 

Updated Date - 2021-05-11T17:58:30+05:30 IST