Abn logo
May 11 2021 @ 16:26PM

నష్టాలతో ముగిసిన మార్కెట్లు!

గత నాలుగు రోజులు లాభాలను ఆర్జించిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) నష్టాలను చవిచూశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. 49,066 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ 340 పాయింట్లు కోల్పోయి 49,161 వద్ద ముగిసింది. ఇక, 14,850 వద్ద రోజును మొదలుపెట్టిన నిఫ్టీ 91 పాయింట్లు కోల్పోయి 14,850 వద్ద స్థిరపడింది. 


కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, ఐఓసీ, ఓఎన్‌జీసీ లాభాలను ఆర్జించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ నష్టాలను చవిచూశాయి. దేశయంగా పెరుగుతున్న లాక్‌డౌన్లు, కోవిడ్ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల వ్యతిరేక పవనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో రోజులో ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఇక, వరుసగా నాలుగు రోజుల లాభాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. 

Advertisement