కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు!

ABN , First Publish Date - 2021-04-23T15:55:26+05:30 IST

భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి.

కోలుకుంటున్న స్టాక్ మార్కెట్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు క్రమంగా కోలుకుంటున్నాయి. ఒక దశలో 250 పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్ ప్రస్తుతం రికవరీ అవుతోంది. 47,863 వద్ద ట్రేడింగ్ ప్రారంభించిన సెన్సెక్స్ ఉదయం 10:20 గంటల సమయానికి 52 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక, 14,326 వద్ద రోజును మొదలు పెట్టిన నిఫ్టీ ఉదయం 10:20 గంటల సమయానికి 9 పాయింట్ల నష్టంతో కదలాడుతోంది. 


పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్‌టీపీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్ లాభాలను ఆర్జిస్తున్నాయి. హెచ్‌యూఎల్, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ నష్టాల బాట పట్టాయి. అమెరికాతోపాటు అంతర్జాతీయ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగియడం, దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడం మదుపర్లను కలవరపెడుతున్నాయి. 

Updated Date - 2021-04-23T15:55:26+05:30 IST