డిప్యూటీ క‌లెక్ట‌ర్ వేధిస్తున్నారంటూ 28 మంది వైద్యాధికారుల రాజీనామా!

ABN , First Publish Date - 2020-08-13T17:06:05+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 28 మంది వైద్యాధికారులు సామూహిక రాజీనామా చేశారు. డిప్యూటీ జీఎంవో మృతిచెందిన తరువాత చెల‌రేగిన ఆందోళ‌నల మ‌ధ్య జిల్లాలోని...

డిప్యూటీ క‌లెక్ట‌ర్ వేధిస్తున్నారంటూ 28 మంది వైద్యాధికారుల రాజీనామా!

వారణాసి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 28 మంది వైద్యాధికారులు సామూహిక రాజీనామా చేశారు. డిప్యూటీ జీఎంవో మృతిచెందిన తరువాత చెల‌రేగిన ఆందోళ‌నల మ‌ధ్య జిల్లాలోని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి బాధ్యత వహిస్తున్న సీఎంవో తన రాజీనామాను చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విబి సింగ్‌కు సమర్పించారు. డిప్యూటీ కలెక్టర్ వేధింపులకు గురిచేస్తున్నార‌ని ఆయ‌న‌ ఆరోపించారు. వైద్య అధికారుల మూకుమ్మ‌డి రాజీనామాతో ఆరోగ్యశాఖ కదిలివ‌చ్చింది. జిల్లా ఉన్నతాధికారులు... రాజీనామా చేసిన వైద్యాధికారులతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. డిప్యూటీ క‌లెక్ట‌ర్ వేధింపుల కార‌ణంగానే డిప్యూటీ జీఎంవో తీవ్ర‌మైన ఒత్తిడికి లోన‌య్యార‌ని వైద్యాధికారులు ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2020-08-13T17:06:05+05:30 IST