కంపు బాబోయ్‌.. కంపు..!

ABN , First Publish Date - 2021-06-14T05:08:48+05:30 IST

మండల కేంద్రంలోని చెన్నూరు పార్కు వీధి ప్రజలు కుళ్లిన వ్యర్థాలు, దుర్గంధం మధ్య జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఉండే కోళ్ల ఫారాల్లోని వ్యర్థాలతో పాటు బార్బర్‌ షాపుల్లో ఉండే వెంట్రుకలు సైతం అక్కడే వేస్తుండడంతో గాలి వీచినప్పుడల్లా ఆ దుర్వాసనతో స్థానికుల ముక్కుపుటాలదిరి పోతు న్నాయి.

కంపు బాబోయ్‌.. కంపు..!
కొండపేట వంతెన కింద గుంపులుగా పందులు

ఇళ్ల సమీపంలోనే కోడి వ్యర్థాలు 

గాలి వీచిందంటే దుర్గంధమే 

ఇదీ చెన్నూరు పార్కువీధి దుస్థితి


పేరుకే మండల కేంద్రం.. కూతవేటు దూరం లోనే పంచాయతీ కార్యాలయం.. అయినా ఏం ప్రయోజనం. పర్యవేక్షణ లోపం.. మనకెందుకులే అనే నిర్లక్ష్యం వెరశి ఆ కాలనీకి శాపంగా మారింది. కోళ్ల ఫారాల్లో ఉండే వ్యర్థాలు.. బార్బర్‌ షాపుల్లో కటింగ్‌ చేసే వెంట్రుకలు.. పందుల స్వైరవిహారంతో.. గాలి వీచిన ప్పుడల్లా సమీపంలోని నివాసుల ముక్కు పుటాలదిరిపోతున్నాయి. ప్రస్తుత పరిస్థి తుల్లో ఇళ్ల సమీపంలో వ్యర్థాలు వేయ డంతో ఎటువంటి వ్యాధులు దరిచేరుతా యోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకెళ్తే... 


చెన్నూరు, జూన్‌ 13: మండల కేంద్రంలోని చెన్నూరు పార్కు వీధి ప్రజలు కుళ్లిన వ్యర్థాలు, దుర్గంధం మధ్య జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఉండే కోళ్ల ఫారాల్లోని వ్యర్థాలతో పాటు బార్బర్‌ షాపుల్లో ఉండే వెంట్రుకలు సైతం అక్కడే వేస్తుండడంతో గాలి వీచినప్పుడల్లా ఆ దుర్వాసనతో స్థానికుల ముక్కుపుటాలదిరి పోతు న్నాయి. పైగా వీటి వల్ల ఎలాంటి రోగాలు వస్తాయోనని భయపడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయం గోడ ఆనుకుని పెన్నానదిలోకి దారి ఉంది. ఆ దారి గుండా ప్రజలు నదిలోకి వెళుతుంటారు. అదే దారిలో ఓ వైపు కోళ్ల వ్యర్థాలతో పాటు కోళ్ల ఈకలు, ఇతరత్రా భాగాలు సైతం వేస్తున్నారు. ఇవన్నీ తేలికపాటివి కాబట్టి ఏ మాత్రం గాలి వీచినా అవి సమీప ఇళ్లల్లోకి వస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. చాలా కాలంగా ఈ పరిస్థితి ఉన్నా ఎవరూ ఎలాంటి చర ్యలు తీసుకోలేదు. ఆ వ్యర్థాలను కాస్త దూరంగా వేయాలని చెప్పినా వినడం లేదని వాపోతున్నారు. అంతేకాక అదే దారి పక్కనే మురుగు కాల్వ (ప్రధాన డ్రైనేజీ) ఉండడంతో పక్కనే కొండపేటకు వెళ్లే వంతెన నుంచి మురుగు కాల్వ నీరంతా వంతెన కింద నుంచి పారుతుంది. ఈ కాల్వలో వ్యర్థాలు కలవడంతో అక్కడ పందులు గుంపులు గుంపులుగా చేరి ఆ మురికి కంపును మరింత రెట్టింపు చేస్తున్నాయి. సంబంఽధిత పంచాయతీ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఎంత చెప్పినా అంతే..!

కోడి వ్యర్థాలు, బార్బర్‌ షాపుల వెంట్రుకలు గాలికి లేచి ఇళ్లలోకి వస్తున్నాయి. పలుమార్లు అవి పారవేసే వ్యక్తులకు తెలిపినా వారు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఎంత చెప్పినా ఇక్కడే పార వేస్తున్నారు. వారు ఇక్కడ తెచ్చి వేస్తే ఎలా ? కంపు కొడుతోంది. గాలి వీచినప్పుడల్లా దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నాం. 

- ఉట్టి రామక్రిష్ణ, పార్కు వీధి, చెన్నూరు


చర్యలు తీసుకుంటాం

కోళ్ల వ్యర్థాలు, వెంట్రుకలు ఇళ్ల సమీపంలో వేయకుండా చర్యలు తీసుకుంటాం. ఇంతవరకు ఈ సమస్య తన దృష్టికి రాలేదు. సంబంధించిన వారికి నోటీసులు ఇస్తాం. ఇకపై వాటిని దూరంగా వేయడమో, లేక నదీతీరంలో గుంతలు తీసి పూడ్చేలా చూస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించం.

- రామసుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శి, చెన్నూరు



Updated Date - 2021-06-14T05:08:48+05:30 IST