Abn logo
Oct 17 2020 @ 17:37PM

ఇండియాలో బిజినెస్ అంత ఈజీ కాదు: బిఎమ్‌డబ్ల్యూ చీఫ్ వ్యాఖ్య

Kaakateeya

న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం చేయడం అంత సులభం కాదని బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా చీఫ్ విక్రమ్ పవా వ్యాఖ్యానించారు. అత్యాధునిక టెక్నాలజీలు భారత్‌లోకి తెస్తున్న సంస్థలు ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు చెల్లిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇది కొత్త టెక్నాలజీ తెస్తున్నందుకు జరిమానా చెల్లిస్తున్నట్టు ఉందని వ్యాఖ్యానించారు. 

‘భారత్‌లో వ్యాపారం చేయడం అంత సులభం కాదు. లగ్జరీ కార్లకు, సాధారణ కార్లకు మధ్య ధరల్లో తేడా అన్ని దేశాల్లోనూ ఉంది. అయితే..ఈ వ్యత్యాసం భారత్‌లో ఉన్నంతగా మరెక్కడా లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక లాక్‌డౌన్ తరువాత ప్రజల అభిరుచుల్లో మార్పు వచ్చిందని కూడా తెలిపారు.


కుటుంబంతో ఎక్కువ సమయంలో గడిపేందుకు అనేక మంది రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారని, వ్యక్తిగత వాహనాలకు ప్రాధాన్యం పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో.. కాలుష్యంపై కూడా ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, ఈ కారణంగా..కర్బన ఉద్గారాలు తక్కువగా వెలువరించే మరింత సమర్థవంతమైన ఇంజెన్లు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement