Abn logo
Jun 3 2020 @ 03:40AM

విరాట్‌.. ఓ క్రికెట్‌ అద్భుతం..: స్మిత్‌

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్‌ కోహ్లీ ఘనతలు అమోఘమని, అతడు ఓ క్రికెట్‌ అద్భుతమని ఆస్ర్టేలియా స్టార్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ కొనియాడాడు. ‘నేను విరాట్‌ను ఎంతో ఇష్టపడతా. అతడో అద్భుతమైన ఆటగాడు. కోహ్లీ రికార్డులు చూస్తే నమ్మశక్యంగా ఉండవు. ప్రతీ రోజూ తనను తాను మెరుగుపరచుకోవడానికి తాను ఎప్పడూ సిద్ధమే. రూపాంతరం చెందిన అతడి శరీరమే అందుకు ఉదాహరణ. విరాట్‌ ఇప్పుడు మంచిఫిట్‌నె్‌సతో బలంగా ఉన్నాడ’ని స్మిత్‌ అన్నాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విరాట్‌ ఛేదించే తీరు బ్రహ్మాండం. అందుకే వైట్‌బాల్‌ క్రికెట్‌లో అతడిని ఎంతగానో అభిమానిస్తా. ఒత్తిడిలోనూ ఎంతో అద్భుతంగా ఆడతాడు. సైలెంట్‌గానే తన పని కానిచ్చేస్తాడు. ఎవరైనా సరే అతడి నుంచి స్ఫూర్తి పొందాల్సిందేన’ని స్మిత్‌ కొనియాడాడు. 

Advertisement
Advertisement
Advertisement