క్లీన్‌ సిటీ వైపు అడుగులు..

ABN , First Publish Date - 2020-06-02T10:05:53+05:30 IST

త్వరలో రా చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా కలెక్టర్‌ రాసం వెంకటేశ్వర్లు, మేయర్‌

క్లీన్‌ సిటీ వైపు అడుగులు..

శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభం

పారిశుధ్య పనుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు


ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో గ్రేటర్‌ పరిధిలో సోమవారం ప్రారంభమైన స్పెషల్‌శానిటేషన్‌ డ్రైవ్‌లో మొత్తం యంత్రాంగం  రోడ్డుపైకి వచ్చింది. ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లలో పేరుకుపోయిన భవన నిర్మాణ వ్యర్థాలు, చెత్తా చెదారం, రోడ్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈనెల 8వ తేదీ వరకు ఈ డ్రైవ్‌ కొనసాగుతుంది.


చిక్కడపల్లి/మియాపూర్‌/కుత్బుల్లాపూర్‌/దుండిగల్‌/నిజాంపేట్‌/పేట్‌బషీరాబాద్‌/ఎర్రగడ్డ/అమీర్‌పేట/గోల్నాక/నార్సింగ్‌/అల్వాల్‌/మెహిదీపట్నం/కూకట్‌పల్లి/నల్లకుంట/రామంతాపూర్‌/ఏఎ్‌సరావునగర్‌/బోడుప్పల్‌/చంపాపేట/అబ్దుల్లాపూర్‌మెట్‌/సరూర్‌నగర్‌/వనస్థలిపురం/కొత్తపేట/ జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): త్వరలో రా చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా కలెక్టర్‌ రాసం వెంకటేశ్వర్లు, మేయర్‌ బుచ్చిరెడ్డితో కలిసి మంత్రి చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. కార్పొరేటర్‌ రాసాల వెంకటేష్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 


ముషీరాబాద్‌ గాంధీనగర్‌ డివిజన్‌లో శానిటేషన్‌ డ్రైవ్‌ను ఎమ్మెల్యే గోపాల్‌ కార్పొరేటర్‌ పద్మానరే్‌షతో కలిసి ప్రారంభించారు.

శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ రవికిరణ్‌, డీసీ వెంకన్న, కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే గాంధీ శానిటేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. కుత్బుల్లాపూర్‌, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. 

దుండిగల్‌ గాగిల్లాపూర్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ పాల్గొన్నారు. 

నిజాంపేట్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, మేయర్‌ కొలన్‌ నీలాగోపాల్‌రెడ్డి, కమిషనర్‌ గోపి, కార్పొరేటర్లతో కలిసి  పర్యటించారు. ఏడు వేల మందికి చెత్తబుట్టలు పంపిణీ చేశారు.

రంగారెడ్డినగర్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, కార్పొరేటర్‌ బి.విజయ్‌శేఖర్‌గౌడ్‌ చెత్తను తొలగించారు. జీడిమెట్ల డివిజన్‌లో వెన్నెలగడ్డ చెరువులో ఎమ్మెల్యే, జోనల్‌ కమిషనర్‌ మమత, అధికారులు యాంటీ లార్వా స్ర్పే విధానాన్ని పరిశీలించారు.

ఎర్రగడ్డలో మున్సిపల్‌ సర్కిల్‌ నెంబర్‌-19 ఉప వైద్యాధికారిణి డాక్టర్‌ బిందు భార్గవి ప్రారంభించారు. అమీర్‌పేట డివిజన్‌ సత్యం టాకీస్‌ ఏరియాలో డీఎంసీ గీతారాధిక, కార్పొరేటర్‌ శేషుకుమారి పాల్గొన్నారు.  

గోల్నాకలో కార్పొరేటర్‌ కాలేరు పద్మావెంకటేష్‌ పాల్గొన్నారు.

బండ్లగూడలో మేయర్‌ మహేందర్‌గౌడ్‌, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి స్పెషల్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు.

అల్వాల్‌ హెచ్‌ఎంటీ కాలనీలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు. ఏఎ్‌సరావునగర్‌ డివిజన్‌ కమలానగర్‌లో ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి, సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ శైలజ, కార్పొరేటర్‌ పావనీరెడ్డి పాల్గొన్నారు. 

కార్వాన్‌లోని నాలాలను ఎమ్మెల్యే కౌసర్‌ పరిశీలించారు.

మూసాపేటలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌  రోడ్లపై ఉన్న చెత్తను తొలగించారు.

నల్లకుంటలో కార్పొరేటర్‌ శ్రీదేవీరమేష్‌, అధికారులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధుల నివారణపై ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి ఎంటమాలజీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

చంపాపేటలో జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్‌ సర్కిల్‌ డీసీ విజయకృష్ణ, కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి  ప్రారంభించారు. పెద్దఅంబర్‌పేట్‌ మునిసిపాలిటీ పసుమాములలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్నాచిరంజీవి ప్రారంభించారు. అల్మా్‌సగూడలో మేయర్‌ పారిజాతానర్సింహారెడ్డి కార్పొరేటర్‌  స్వప్నావెంకట్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. 

బీఎన్‌రెడ్డినగర్‌లో ఉప కమిషనర్‌ మారుతీ దివాకర్‌, కార్పొరేటర్‌ లక్ష్మీప్రసన్నగౌడ్‌ ప్రారంభించారు. రోడ్లకిరువైపులా వ్యర్థాలు, చెత్త, మట్టి కుప్పలను తొలగించారు. చెత్తను తరలించారు. 

హయత్‌నగర్‌ డివిజన్‌ ఆంధ్రకేసరినగర్‌ కాలనీలో ఉప కమిషనర్‌ మారుతీ దివాకర్‌, కార్పొరేటర్‌ తిరుమల్‌రెడ్డి, ఏఎంహెచ్‌వో మంజులావాణి ప్రారంభించారు. కొత్తపేట సీటీఓ కాలనీలో కార్పొరేటర్‌ సాగర్‌రెడ్డి ప్రారంభించారు.

మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. తమకు సమాచారం ఇవ్వలేదని కార్పొరేటర్లు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు.


రోడ్లపై చెత్తవేస్తే జరిమానా 

రోడ్లపై చెత్త వేసేవారికి రూ. 500 జరిమానా విధించాలని ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌  ఆదేశించారు. మణికొండ మున్సిపాలిటీ పంచవటి  కాలనీ పందెన్‌వాగులో చెత్త తొలగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి రోజు రూ. 16 లక్షలతో 10 చెత్త సేకరణ ఆటోలు, రూ. 30లక్షలతో పందెవాగు పూడికతీత పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు. 

Updated Date - 2020-06-02T10:05:53+05:30 IST