మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు చర్యలు

ABN , First Publish Date - 2021-04-13T05:00:07+05:30 IST

బీసీల ఆత్మగౌరవ ప్రతీక మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ప్రతిష్ఠించనున్నట్లు బీసీ సమాఖ్య వ్యవస్థా పక అధ్యక్షుడు డాక్టర్‌ సోమా లక్ష్మీ నరసయ్య, అధ్యక్షు డు బొర్రా రామాంజనేయులు పేర్కొన్నారు.

మహాత్మా జ్యోతిరావు పూలే  విగ్రహ ఏర్పాటుకు చర్యలు


ప్రొద్దుటూరుఅర్బన్‌, ఏప్రిల్‌ 12: బీసీల ఆత్మగౌరవ ప్రతీక మహాత్మా జ్యోతిరావు పూలే  విగ్రహాన్ని ప్రొద్దుటూరులో  ప్రతిష్ఠించనున్నట్లు బీసీ సమాఖ్య వ్యవస్థా పక అధ్యక్షుడు డాక్టర్‌ సోమా లక్ష్మీ నరసయ్య,  అధ్యక్షు డు బొర్రా రామాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆశ్రమం వీధిలోని బీసీ సమాఖ్య కార్యాలయంలో ఈనెల 14 జరిగే విగ్రహావిష్కరణ కరపత్రాలను బీసీ సమాఖ్యనేతలు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శతాబ్దాల కిందటే దేశంలో కులవ్యవస్ధ నిర్మూలనకోసం పోరాడి బడుగు, బలహీనులకు ఆత్మస్ధై ర్యాన్ని నింపిన పోరాట యోధుడు పూలే అన్నారు. ఈనెల 14 న ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద జరిగే పూలే విగ్రహ ఆవిష్కరణ సభ కు బడుగు, బలహీన వర్గాల ప్రజానీకం పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో విగ్రహ సాధన కమిటీ కన్వీనర్‌ విశ్వప్రసాద్‌,  బీసీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి గొడుగు గుర్రప్ప, ఉపాధ్యక్షుడు మేకల సుబ్బరామయ్య, కోశాధి కారి క్రిష్ణయ్యయాదవ్‌, ఈడెం లక్ష్మీనారాయణ, కాలే ఆనంద్‌, నాగమళ్ళ శంకర్‌ జింకా జయప్రకాష్‌ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T05:00:07+05:30 IST