మద్దిరాల కాలువ పునరుద్ధరణకు చర్యలు

ABN , First Publish Date - 2020-08-08T10:14:27+05:30 IST

మద్దిరాల యారకాలువ వాగు వెంబడి పంటపొలాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుం టామని అధికారులు తెలిపారు.

మద్దిరాల కాలువ పునరుద్ధరణకు చర్యలు

ఆక్రమణలు తొలగించి సర్వే చేస్తాం

అధికారుల పరిశీలన


నాగులుప్పలపాడు, ఆగస్టు 7: మద్దిరాల యారకాలువ వాగు వెంబడి పంటపొలాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకుం టామని అధికారులు తెలిపారు. నాగులుప్పల పాడు, ఇంకొల్లు మండలాల్లోని ముప్పాళ్ళ, మద్దరాల, ఈదుమూడి, దుద్దుకూరు గ్రామా ల్లో గుండా మద్దిరాల యారకాలువ ప్రవహి స్తుంది. అయితే ఈ కాలువ ఆక్రమణలతో వరదల సమయంలో పంట భూముల రైతు లు తీవ్రంగా నష్టపోతున్నారు.  దీనిపై గత నె ల 25న ఆంధ్రజ్యోతిలో మద్దిరాలవాగు ఆక్ర మణపై కథనం ప్రచురితమైంది. దీనిపై అ ధికారులు స్పందించారు. శుక్రవారం ఇంకొల్లు తహసీల్దార్‌ బ్రహ్యయ్య, నాగులుప్పలపాడు మండల ఆర్‌ఐలు, ఆయాగ్రామాల వీఆర్వోలు ముంపునకు గురవుతున్న భూములను పరి శీలించారు.


ఈ సందర్భంగా రైతులు మాట్లా డుతూ వాగు ఆక్రమణతో ఎగువ నుంచి వ చ్చే వర్షపు నీరంతా మెట్టభూములలో నెలల తరబడి నిలబడుతుందని, దీనివల్ల పొలాలు చౌడు భూములుగా మారుతున్నాయని ఆవే దన వ్యక్తం చేశారు. దీనితో పాటు రెండు మ ండలాలకు  చెందిన సుమారు 500 ఎకరాలు పంటలు పండక ప్రతి ఏడాది నష్టపోతున్నా మని వాపోయారు. దీనిపై స్పందించిన అధి కారులు మాట్లాడుతూ వాగులో పూర్తిసా ్థయి లో సర్వే చేస్తామన్నారు. భూముల్లో నీరు ని లబడకుండా ఉండేందుకు తవ్వకాలు చేపడ తామని తహసీల్దార్‌ బ్రహ్మయ్య చెప్పారు.

Updated Date - 2020-08-08T10:14:27+05:30 IST