ఆర్థిక సాధికారతకు అడుగులు

ABN , First Publish Date - 2021-07-22T06:13:13+05:30 IST

స్వయం సహాయక సంఘాల బలోపేతమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్‌) కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా స్వశక్తి సంఘాలన్నింటినీ జాతీయస్థాయిలో ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు జాతీయ గ్రామీణ జీవనోపాధుల సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంఘాల్లోని ప్రతీ సభ్యురాలి ఆర్థిక సాధికారత వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.

ఆర్థిక సాధికారతకు అడుగులు
సమావేశంలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు(ఫైల్‌)

జాతీయస్థాయిలో ఒకే గొడుగు కిందికి స్వశక్తి సంఘాలు

జీవనోపాధుల మెరుగే లక్ష్యంగా సమగ్ర సమాచార సేకరణ

స్వయం సహాయక సంఘాల బలోపేతమే లక్ష్యం


చౌటుప్పల్‌: స్వయం సహాయక సంఘాల బలోపేతమే లక్ష్యంగా పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్‌)  కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా స్వశక్తి సంఘాలన్నింటినీ జాతీయస్థాయిలో ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు జాతీయ గ్రామీణ జీవనోపాధుల సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సంఘాల్లోని ప్రతీ సభ్యురాలి ఆర్థిక సాధికారత వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 72మండల, 2,271గ్రామ సమాఖ్యలు, 61,542 సమభావన సంఘా లు ఉన్నాయి. వీటిలో 6,54,033మంది సభ్యులు ఉన్నా రు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17మండల, 558 గ్రామ సమాఖ్యలు, 14,873సమభావన సంఘాలు ఉండగా 1,57,184 మంది సభ్యులు ఉన్నారు. నల్లగొం డ జిల్లాలో 32మండల, 1,156గ్రామ సమాఖ్యలు, 28,710సమభావన సంఘాలు, 3,06,497మంది సభ్యు లు ఉన్నారు. సూర్యాపేట జిల్లాలో 23మండల, 557గ్రా మ సమాఖ్యలు, 17,959సమభావన సంఘాలు, 1,90,352మంది సభ్యులు ఉన్నారు. 


71అంశాలపై సమాచార సేకరణ

స్వశక్తిసంఘాల ఏర్పాటు, స్వయం ఉపాధి రుణా లు, సమానత్వం, ఆరోగ్యం, పౌష్టికాహారం, గ్రామాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం, ఆర్థిక లావాదేవీలు ఇలా 71అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు. సేకరించిన అంశాలన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు సంఘాల్లోని సభ్యుల సమ గ్ర సమాచారంతో పాటు ఫొటో సైతం చిత్రీకరించి ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేస్తారు. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో ఈ సర్వేకు ఇటీవల అంతరాయం ఏర్పడింది. ఈజాబితా ఆధారంగానే తాజాగా మహిళల్లో ఆర్థిక పరిపుష్టి నింపేలా సర్వే కొనసాగుతోంది. సర్వేలో లో పాలను గుర్తించి మహిళల స్వయం ఉపాధికి చర్యలు తీసుకోనున్నారు. ఆన్‌లైన్‌లో ఒక్క క్లిక్‌తో దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సమాచారం అందుబాటులోకి రానుంది. 


ఈ సమాచార సేకరణ ఎందుకు?

సంపాదనలో పైసా పైసా పొదుపు చేస్తూనే మహిళలు రుణాలు పొంది కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు.అందులో భాగంగా సంఘాల్లోని పొదుపు సభ్యు ల హాజరు, అప్పులు, రికార్డుల నిర్వహణపై ప్రతినెలా సమీక్షించాల్సి ఉంటుంది. స్వశక్తి సంఘాలు, గ్రామ, మండల సమాఖ్య పరిధిలో ప్రతి నెలా సమావేశాలు నిర్వహించాలి. సంఘాల్లోని పొదుపు డబ్బులు దుర్వినియోగంగా కుండా అంతర్గతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్థికాభివృద్ధితో పాటు మహిళల సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు. గ్రామసభలు, సంక్షేమ పథకాల్లో మహిళల భాగస్వామ్యం రోజురోజుకూ తగ్గుతోంది. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేక కొన్నిచోట్ల రుణాల సొమ్ము పక్క దారి పడుతోంది. దీంతో మహిళల ఆర్థిక పురోగతి ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. 


ఆర్థిక బలోపేతానికి కృషి

మహిళా సంఘాల్లోని మహిళల జీవనోపాధులు మెరుగుపరిచేందుకు జాతీయ స్థాయిలో సర్వే చేపట్టా రు.71అంశాలతో కూడిన సమగ్ర సమాచారాన్ని సేకరించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఏడాదిలో నాలుగు త్రైమాసికా లకు లక్ష్యాలు నిర్దేశించారు. మహిళా సంఘాల్లో సూ క్ష్మ రుణ ప్రణాళిక అమలులో భాగంగా ముందుగా కొత్త సంఘాలకు రుణాలు మంజూరు చేయడంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు స మాన హక్కులు ఉన్నాయని, స్త్రీ, పురుష వ్యత్సాసం లేదని, వారిలో చైతన్యం తేవడం వెనుకబడిన వర్గాల కు సామాజిక పెట్టుబడుల కింద రుణాలు మంజూరు చేయడం, గతంలో పొందిన రుణాలు రికవరీ తదితర సమస్యలను అధిగమించి చాలా వరకు ప్రోత్సహిస్తు న్నారు.ప్రతీ సభ్యురాలి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి ఉందా, నిర్వహణలోనే ఉందా లాంటి తదితర విషయాలను సర్వేలో సమాచారంతో సేకరిస్తున్నారు. గ్రామ సంఘాల్లో వివిధ కమిటీలు ఉంటాయి. వీటిని క్రమబద్ధీకరించి మనుగడలోకి తేనున్నారు. గ్రామాభివృద్ధిలో మహిళలు ముఖ్యపాత్ర పోహించేలా అవగాహన కల్పిస్తారు. ప్రతినెలా సమావేశాలకు అధికారులు హాజరయ్యేలా చూస్తారు. ప్రతీ మహిళ సొంతం గా పురోభివృద్ధి సాధించాలన్నదే కార్యక్రమాలలక్ష్యం. 


రుణ పరిమితి పెంచుతున్నాం: ఎం.ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ, యాదాద్రిభువనగిరి

సమభావన సంఘాల్లో మహిళల ఆర్థికాభివృద్ధిని మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.  అందులో భాగంగానే ఇప్పటికే ఉన్న సమాచారంతో పాటు మరింత అదనపు సమాచారాన్ని ఫొటోలతో కూడిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నాం.  బ్యాంకులతో  సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని గతంలో కంటే మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త ద్వారా మహిళలు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.  


Updated Date - 2021-07-22T06:13:13+05:30 IST