ఓటరు జాబితా సవరణకు చర్యలు

ABN , First Publish Date - 2021-10-28T05:19:34+05:30 IST

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు.

ఓటరు జాబితా సవరణకు చర్యలు
ఏనుగొండలో వ్యాక్సిన్‌ వేసుకోని వారితో మాట్లాడుతున్న కలెక్టర్‌

- వివరాలు వెల్లడించిన కలెక్టర్‌ వెంకట్రావు 

- రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ వీసీ


మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), అక్టోబరు 27 : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు  కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఓటరు జాబితా కార్యక్రమంపై ఈ నెల 28న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నామని, దీనిపై తహసీల్దార్లకు తగు సూచనలు ఇచ్చామని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా నవంబరు 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని, ఆ నెల 30 వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబరు 20 న అభ్యంతరాల పరిష్కారం, జనవరి 5 2022న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. కార్యక్ర మంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ కె. సీతారామారావు, సి విభాగం సిబ్బంది, అన్ని మండలాల ఎలెక్షన్‌ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.


మానవ సేవే మాధవ సేవ 


మహబూబ్‌నగర్‌ (కలెక్టరేట్‌)/ మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, అక్టోబరు 27 : మానవసేవే మాధ వసేవ అని కలెక్టర్‌ ఎస్‌. వెంకట్రావు అన్నారు. మానవు లుగా జన్మించినందుకు మానవ ధర్మాన్ని పాటించాలని ఆయన సూచించారు. అప్పుడే మానవాళి సుఖసంతోషాలతో ఉంటుందని అన్నారు. బుధవారం శ్రీ సాయి లలిత సేవా మండలి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంధుల ఆశ్రమ పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథి గా హాజరయ్యారు. వృద్ధులు, పిల్లలు, విద్యార్థులు, ప్రజలకు అవసరమైన కార్యక్రమాలను మాత్రమే సాయి లలితా సేవా మండలి వారు చేస్తున్నా రని, ఇది ఎంతో గొప్ప విషయమని అన్నారు. అంధుల ఆశ్రమ పాఠశా లకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. శ్రీ సాయి లలితా సేవామండలి సభ్యురాలు శాంతికుమారి, డీఐఓ సత్యనా రాయణ మూర్తి, మండల సభ్యులు లీల, అంధుల ఆశ్రమ పాఠశాల ప్రినిసిపాల్‌ రాములు పాల్గొన్నారు.


ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్‌ వేయాలి


మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం), అక్టోబరు 27 : ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్‌ వేయాలని కలెక్టర్‌ వెంకట్రావు ఆదేశించారు. బుధవారం ఆయన ఏనుగొండలోని వ్యాక్సిన్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా తని ఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్‌ వేయించుకోలేని వారి ఇంటికి వెళ్లి ఆరా తీశారు. వారు వ్యాక్సిన్‌ వేసుకునేలా చైతన్యంవంతులని చేశారు. 100 శాతం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కే.సి నర్సింహులు, డిప్యూటీ డీఎం అండ్‌హెచ్‌వో డా. శశికాంత్‌, ప్రోగ్రాం ఆఫీసర్‌ డా. రఫీక్‌, మునిసిపల్‌ కమిషనర్‌ ప్రదీప్‌ పాల్గొన్నారు.


 కుమ్మరి వాడలో పరిశీలన 


జడ్చర్ల, అక్టోబరు 27 : వ్యాక్సినేషన్‌ 100శాతం పూర్తి కావాలని కలెక్టర్‌ వెంకట్రావు సూచించారు. జడ్చర్ల అర్బన్‌హెల్త్‌సెంటర్‌, మునిసి పాలిటీ 10వ వార్డులోని కుమ్మరివాడ కాలనీలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమా న్ని పరిశీలించారు. ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ తీసుకోవాలని సూచించారు. అలాగే కాలనీలో పారిశుధ్యం, ఇతర అంశాలపై మునిసిపల్‌ కమిషనర్‌ సునీత, కౌన్సిలర్‌ కుమ్మరి రాజుతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహ సీల్దార్‌ లక్ష్మీనారాయణ, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కృష్ణ, డీఎంఓ విజయ్‌ కుమార్‌, అర్బన్‌హెల్త్‌సెంటర్‌ అధికారి డాక్టర్‌ శివకాంత్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కృష్ణారెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-28T05:19:34+05:30 IST