ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-02-26T03:59:38+05:30 IST

యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో పలుశాఖల అధికారులతోపాటు రైస్‌మిల్లర్లతో సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు అంచనా లక్ష్యం, అవసరమైన గన్ని సంచులతోపాటు రైస్‌మిల్లర్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ భారతి హొళికేరి 

మంచిర్యాల కలెక్టరేట్‌, పిబ్రవరి 25 : యాసంగి ధాన్యం కొనుగోలుకు ముందస్తుగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో పలుశాఖల అధికారులతోపాటు రైస్‌మిల్లర్లతో సమీక్ష సమా వేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు అంచనా లక్ష్యం, అవసరమైన గన్ని సంచులతోపాటు రైస్‌మిల్లర్లు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గతంలో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వచ్చిందని, ఈసారి అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున సన్నద్ధంగా ఉండాలని తెలిపారు. జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్‌ గోపాల్‌, జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి వీరయ్య, జిల్లా సహకార శాఖ అధి కారి సంజీవరెడ్డి, జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్య, జిల్లా మార్కెటింగ్‌ అధికారి గజానంద్‌, రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నల్మాసుకాంతయ్య,   పాల్గొన్నారు. 

ఉపాధ్యాయులపై కలెక్టర్‌ ఆగ్రహం 

కన్నెపల్లి: మండలంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశా లను గురువారం కలెక్టర్‌ భారతి హోళికేరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు ఒకే చోట కూర్చోవడంతో కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలను తెరిస్తే  పాఠాలు బోధించకుండా నిర్లక్ష్యంగా ఉంటారా అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు సంజీవ్‌, మరో ఉపాధ్యాయుడు లీవు పెట్టకుండా పాఠశాలకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీఈవోకు ఆదేశించారు.  మాస్కులను ధరించాలని, పరిశుభ్రంగా ఉండాలని విద్యా ర్థులకు కలెక్టర్‌ సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. తహసీల్దార్‌ రాంచందర్‌రావు, ఎంపీడీవో శంకరమ్మ ఉన్నారు. 

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి 

భీమిని : గ్రామాల్లో  చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. వీగాంలో పర్యటించి శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌యార్డు పనులను పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం చుట్టూ ఫెన్సింగ్‌ చేపట్టి పశువులు రాకుం డా చూడాలన్నారు. వనంలోని మొక్కలను సంరక్షిం చాలన్నారు. చేసిన పనులకు బిల్లులు రావడం లేదని సర్పంచు తులసీరామగౌడ్‌  కలెక్టర్‌కు విన్నవించారు.    కార్యదర్శి వంశీ  పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-26T03:59:38+05:30 IST