Abn logo
Apr 17 2021 @ 00:23AM

కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టాలి

 కలెక్టర్‌ కె శశాంక

సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 16: జిల్లాలో కరోనా కేసులు ముమ్మరంగా పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు చర్యలు చేపట్టాలని, ప్రజలు తగి న జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం కలె క్టరేట్‌ సమావేశ మందిరంలో కొవిడ్‌ నియంత్రణపై తీసుకోవాల్సిన చర్య లపై ప్రభుత్వ వైద్యాధికారులు, ఐఎంఏ, మెడికల్‌ ఆఫీసర్లతో సమీ క్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 96 ఆసుపత్రులలో 20 బెడ్‌లకు ఎక్కువగా ఉన్న ఆసుపత్రుల్లో కొవిడ్‌ పే షెంట్లను అడ్మిట్‌ చేసుకోవాలన్నారు. ఆసుపత్రులకు క్రెడిన్షల్‌ లాగిన్‌ వెంటనే ఇవ్వాలని వైద్యాధికారులను, డీపీఎంను కలెక్టర్‌ ఆదేశించారు. ఐఎంఏ జిల్లా ప్రెసిడెంట్‌ డాక్టర్‌ బీఎన్‌రావు మాట్లాడుతూ సీటీ స్కాన్‌ టెస్టును 3 వేల రూ పాయలకంటే ఎక్కువ చార్జీ చేయరాదని తెలిపారు. కొవిడ్‌ పేషెంట్లు ట్రీట్‌మెంట్‌ క్లినికల్‌ ప్రొటోకాల్‌ పాటించాలన్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రు లలో కొవిడ్‌, నాన్‌-కోవిడ్‌ బోర్డులను తెలుగులో రాయించి అమర్చాలని సూచించారు. సమావేశంలో డీటీసీవో రవీందర్‌రెడ్డి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రత్నమాల, ప్రైవేట్‌ ఆసుపత్రుల వైద్యులు,ఫార్మసి సూపర్‌వైజర్‌ భారతి,  పాల్గొన్నారు. 


కొవిడ్‌ టీకా పంపిణీలో అలసత్వం వద్దు


హుజూరాబాద్‌ రూరల్‌: కొవిడ్‌ టీకా పంపిణీలో వైద్య సిబ్బంది అలసత్వం చేయవద్దని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని పరిశీలించారు. ఆస్పత్రిలో టీకా పంపిణీ తీరు ను సూపరింటెండెంట్‌ రమేష్‌ను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్‌ టీకాపై వైద్య సిబ్బంది విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. మొదటి, రెండో విడతల్లో టీకా తీసుకున్న వారి వివరాలను పక్కగా నమోదు చేయాలని సూచించారు. 

 సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కలెక్టర్‌ శశాంక స్థల పరిశీలన చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని బోర్నపల్లి కెనాల్‌ సమీపంలోని ఎస్సా రెస్సీ స్థలం వద్ద సమీకృత మార్కెట్‌ నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్డీవో బెన్‌షాలేమ్‌, తహసీల్దార్‌ బావ్‌సింగ్‌, కమిషనర్‌ ప్రసన్నరాణి పాల్గొన్నారు.


అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి


కరీంనగర్‌, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ, నర్సరీ, సెగ్రిగేషన్‌ షెడ్లు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కె శశాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, జడ్పీ సీఈవో, డీఆర్‌డీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సెగ్రిగేషన్‌ షెడ్లు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాల పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున వాటి నియంత్రణకు పరీక్షల శాతం పెం చేలా చూడాలని, సెంటర్లను వేర్వేరుగా ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్‌ ఎక్కువగా జరిగేలా దృష్టిపెట్టాలన్నారు. స్కూల్స్‌, కమ్యూ నిటీ హాల్స్‌ వద్ద కొవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేసి టెంట్లు, తాగునీరు, కుర్చీలు, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.  నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సర్పంచు లు, కార్యదర్శులు, ఆశావర్కర్లను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం కింద మంజూరైన లేబర్‌ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి పంచాయతీకి వంద మంది పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి కంపోస్టు ఎరువుకు పంపేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. గత సంవత్సరంలో మంచి ఫలితాలు సాధించారని, ఈ సంవత్సరం కూడా రెట్టింపు ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.  వీడియో కాన్ఫరెన్సులో డీఆర్‌డీవో శ్రీలత, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రత్నమాల, డీటీసీవో డాక్టర్‌ రవీందర్‌రెడ్డి, మెప్మా పీడీ రవీందర్‌, డిప్యూటీ సీఈవో రమేశ్‌, పాల్గొన్నారు.

Advertisement