ఎస్వీబీసీ వెబ్‌సైట్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు

ABN , First Publish Date - 2020-07-03T01:52:46+05:30 IST

శ్రీ వేంకటేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు సంబంధించిన www.svbcttd.com వెబ్‌సైట్ కాల‌ప‌రిమితి జూన్ 30వ తేదీతో ముగిసింది. ఈ వెబ్‌సైట్ డొమైన్ రెన్యువ‌ల్ కోసం సంబంధిత అధికారులు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

ఎస్వీబీసీ వెబ్‌సైట్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు చ‌ర్య‌లు

తిరుమల : శ్రీ వేంకటేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌కు సంబంధించిన www.svbcttd.com వెబ్‌సైట్ కాల‌ప‌రిమితి జూన్ 30వ తేదీతో ముగిసింది. ఈ వెబ్‌సైట్ డొమైన్ రెన్యువ‌ల్ కోసం సంబంధిత అధికారులు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.


క‌రోనా నేప‌థ్యంలో డొమైన్ స‌కాలంలో రెన్యువ‌ల్ కానుందువ‌ల్ల జూన్ 30 వ తేదీన డౌన్ అయింది. దీంతో www.svbcttd.com వెబ్‌సైట్‌పై క్లిక్ చేస్తే ఎస్వీబీసీకి సంబంధం లేని వెబ్‌సైట్లు వ‌స్తున్నాయి. దీన్ని గ‌మ‌నించిన టిటిడి ఐటి విభాగం... డొమైన్ పున‌రుద్ధ‌ర‌ణకు చ‌ర్య‌లు తీసుకుంటోంది.

Updated Date - 2020-07-03T01:52:46+05:30 IST