జిల్లా అభివృద్ధి కోసం దశల వారీ ఉద్యమాలు

ABN , First Publish Date - 2021-11-29T05:49:43+05:30 IST

జిల్లా నుంచి పలురంగాల్లో ఆదాయం లభిస్తున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నదని పలువురు వ క్తలు ధ్వజమెత్తారు. ఇందుకోసం దశల వారీగా ఉద్యమాలు చేపడతామన్నారు.

జిల్లా అభివృద్ధి కోసం దశల వారీ ఉద్యమాలు
మాట్లాడుతున్న పూనాటి ఆంజనేయులు

ఒంగోలు(కలెక్టరేట్‌), నవంబరు 28 : జిల్లా నుంచి పలురంగాల్లో ఆదాయం లభిస్తున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నదని పలువురు వ క్తలు ధ్వజమెత్తారు. ఇందుకోసం దశల వారీగా ఉద్యమాలు చేపడతామన్నారు. ఒంగోలులోని సు ందరయ్య భవన్‌లో సీపీఎం ఆధ్వర్యంలో ఆదివా రం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సం దర్భంగా తూర్పు ప్రకాశం జిల్లా కార్యదర్శి పూనా టి ఆంజనేయులు మాట్లాడుతూ అన్ని రంగాల్లో జిల్లా వెనుకబడి ఉందని, దీనిని వెనుకబడిన జి ల్లాగా గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ, పారిశ్రా మికరంగాల్లో వెనుకబడి ఉన్నందున జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు కేటాయించాలని కో రారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. రహదారుల అభి వృద్ధి, సెజ్‌ల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని, జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీరు అఅందించాలని కోరారు. ఆ యా సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి కార్యా చరణ ప్రణాళికసిద్ధం చేసి మార్చిలో జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రభుత్వంపై వత్తిడీ తెచ్చేందుకు దశల వారీ ఉద్యమం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యద ర్శి ఎంఎల్‌.నారాయణ, సీపీఎం నాయకులు వై. సిద్దయ్య, జీవీ.కొండారెడ్డి, పెంట్యాల హనుమంత రావు, కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు శ్రీపతిప్రకాశం, విద్యావేత్త తాటిపర్తి గోపాల్‌రెడ్డి, చుంచు శేష య్య, దాసరి సుందరం, కోడూరి హనుమంతరా వు, రఫీ అహ్మద్‌, ఎస్‌కే.మాబు, కంకణాల ఆంజ నేయులు, జి.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-29T05:49:43+05:30 IST