పీఆర్సీ సాధనకు దశలవారీగా ఆందోళనలు

ABN , First Publish Date - 2022-01-24T04:44:15+05:30 IST

పీఆర్సీ సాధనకు దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.

పీఆర్సీ సాధనకు దశలవారీగా ఆందోళనలు
మాట్లాడుతున్న వీసీహెచ వెంగళరెడ్డి

  1. నేడు కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేత.. 
  2.  రేపు జడ్పీ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ
  3. 26న అంబేడ్కర్‌, దామోదరం విగ్రహాలకు వినతి పత్రాలు..
  4. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతల వెల్లడి


కర్నూలు (కల్చరల్‌), జనవరి 23: పీఆర్సీ సాధనకు దశల వారీగా ఆందోళనలు చేపడుతున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ డ్రైవర్స్‌ అసోసియేషన సంఘం భవనంలో పీఆర్సీ సాధన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఛైర్మన్లు వీసీహెచ వెంగళరెడ్డి, నాగరమణయ్య, రఘుబాబు, నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏపీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు హాజరయ్యారు. 130 ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. భవిషత్తు కార్యాచరణ ప్రకటించారు. 

- 24న జిల్లా కలెక్టర్‌కు సమ్మె నోటీసు అందజేత

-  25న జడ్పీ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ఎత్తున ర్యాలీ

-  26న గణతంత్ర దినోత్సవం నాడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, దామోదరం సంజీవయ్య విగ్రహాలకు వినతి పత్రాల అందజేత

-  26న రిపబ్లిక్‌ డే నాడు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ప్రశంసా పత్రాల తిరస్కరణ

-  27 నుంచి 30 వరకు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట రిలే నిరాహార దీక్షలు

-  ఫిబ్రవరి 3న చలో విజయవాడ

-  5న ప్రభుత్వ యాప్‌లను డౌన చేయడం, ప్రభుత్వానికి సహాయ నిరాకరణ

-  ఫిబ్రవరి 6న అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లుట. 

ఫ సమావేశంలో ప్రభుత్వంలో ప్రధాన భాగమైన ఏపీఎస్‌ ఆర్టీసీ ఉద్యోగులు బస్సులు నిలుపుదల, మున్సిపల్‌ ఉద్యోగులు అన్ని పనులు నిలుపుదల చేయడానికి ప్రతిజ్ఞ చేశారు. సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడడు వి.దస్తగిరిరెడ్డి, నగర అధ్యక్షుడు ఎంసీ కాశన్న, కార్యదర్శి పాండురంగారెడ్డి, ఏపీఎస్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన, ఎంప్లాయీస్‌ యూనియన నాయకులు మద్దిలేటి, ఏవీ రెడ్డి, వ్యవసాయశాఖ రవిప్రకాశ, ఉపాధ్యాయ సంఘాలు ఇస్మాయిల్‌, తిమ్మప్ప, రంగన్న, రమేశ, నారాయణరెడ్డి, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం నాగేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం మద్దిలేటి, నర్సుల సంఘం శాంతి భవాని, ట్రెజరీ ఉద్యోగుల సంఘం కరుణాకర్‌, సునీల్‌, గజిటెడ్‌ అధికారుల సంఘం అల్తాఫ్‌ అలీఖాన, మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్‌, సచివాలయం, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘంతోపాటు 130 ఉద్యోగ సంఘాల నాయకులు 200 మంది పాలొన్నారు. 


Updated Date - 2022-01-24T04:44:15+05:30 IST