దశలవారీగా వాహనాల విడుదల : సీపీ

ABN , First Publish Date - 2020-05-23T08:46:57+05:30 IST

లాక్‌డౌన్‌లో అకారణంగా రోడ్లపైకి వచ్చి చిక్కిన వాహనాలను విడుదల చేయడానికి పోలీసులు

దశలవారీగా వాహనాల విడుదల : సీపీ

విజయవాడ, మే 22 (ఆంధ్రజ్యోతి) : లాక్‌డౌన్‌లో అకారణంగా రోడ్లపైకి వచ్చి చిక్కిన వాహనాలను విడుదల చేయడానికి పోలీసులు ముందుకొచ్చారు. ఇప్పటివరకు 1,590 వాహనాలను ఆయా వాహనదారులకు అప్పగించామని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు శుక్రవారం వెల్లడించారు. ఈనెల 21వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’లో ‘విడుదల ఎప్పటికో..’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై సీపీ స్పందించారు.


లాక్‌డౌన్‌లో మొత్తం 8,427 వాహనాలను సీజ్‌ చేశామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ 4.0లో ఇచ్చిన మినహాయింపుల కారణంగా సీజ్‌ చేసిన వాహనాలను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పోలీసులు పిలిచినప్పుడు ఆయా వాహనదారులు వచ్చి తగిన ఆధార పత్రాలను చూపించి వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.

Updated Date - 2020-05-23T08:46:57+05:30 IST