ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ

ABN , First Publish Date - 2021-07-31T06:00:05+05:30 IST

ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించవచ్చని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ 

కూర్మన్నపాలెం, జూలై 30: ఐక్య పోరాటాలతో స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించవచ్చని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 169వ రోజు కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో టీపీపీ, పీఈఎం, హెచ్‌వైడీ, ఎల్‌ఈడీ, రెడ్‌ విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ బీజేపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉక్కు కర్మాగారాన్ని తమ తాబేదార్లకు ఎలా కట్టబెట్టాలన్న కుయుక్తులు చేస్తూ, నష్టాల సాకు చూపి దుష్ప్రచారం చేశారన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ఉక్కు కర్మాగారంపై ఆధారపడ్డ చిన్న, మధ్య తరగతి కర్మాగారాల కార్మికులకు ఉద్యోగ భద్రత కరువవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెర్రిపోతుల ముత్యాలు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌, శేషగిరి, నరసింహులు, మూర్తి, గోపి, అప్పలరాజు, నాయుడు, మధు, పుల్లయ్య, కృష్ణారావు, గంధం వెంకటరావు, కె.సత్యనారాయణ, వరసాల శ్రీనివాసరావు, లెనిన్‌బాబు, విళ్లా రామ్మోహన్‌ కుమార్‌, మస్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T06:00:05+05:30 IST