స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన ఉపసంహరించుకోవాలి

ABN , First Publish Date - 2021-05-12T05:09:17+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు కోరారు

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన ఉపసంహరించుకోవాలి
దీక్షల్లో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు

కూర్మన్నపాలెం, మే 11: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్‌ గంధం వెంకటరావు కోరారు. కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు  పరిరక్షణ పోరాట  కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 88వ రోజు కొనసాగాయి. మంగళవారం ఈ దీక్షల్లో పాల్గొన్న సీఓ అండ్‌ సీసీపీ  కార్మికులనుద్దేశించి వెంకటరావు మాట్లాడుతూ  కార్మికులు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఈ దీక్షలలో పాల్గొనాలని కోరారు. కార్మిక పోరాటాలు అణచివేసేందుకు, సమ్మెలు చేయకుండా, సంఘాలు పెట్టకుండా లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం మార్పు చేసిందన్నారు.      విశాఖ ఉక్కు పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టాలని కేంద్ర ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు.  ఈ శిబిరంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ సభ్యులు  ఆనంద్‌, మొయిద్దీన్‌, దేముడు, శ్రీనివాస్‌, శ్యామ్‌ సుందర్‌, సుబ్బారావు, బాబూరావు, సూర్య నారాయణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-12T05:09:17+05:30 IST