స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన తగదు

ABN , First Publish Date - 2021-05-08T05:03:23+05:30 IST

ఆక్సిజన్‌ను అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలుపుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన తగదని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన తగదు
దీక్షా శిబిరంలో పాల్గొన్న ఉద్యోగులు

ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, మే 7: ఆక్సిజన్‌ను అందిస్తూ ఎందరో ప్రాణాలను నిలుపుతున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన తగదని ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 85వ రోజు కొనసాగాయి. శుక్రవారం ఈ దీక్షలలో సీఎంఎం, సీఎంఈ, టెలికామ్‌, ఏసీఎస్‌, ఈటీఎల్‌ విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరంలో ఆదినారాయణ మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితులలో ఉక్కు ఉద్యోగులు పలువురు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని యాజమాన్యాన్ని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సంపదను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నదని ఆరోపించారు. ఈ దీక్షలలో కె.సత్యనారాయణ, వేములపాటి ప్రసాద్‌, రామ్మోహన్‌, భానుమూర్తి, శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, వాసు, రవిచంద్ర, దుర్గాప్రసాద్‌, సత్యారావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-08T05:03:23+05:30 IST