స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన దుర్మార్గం

ABN , First Publish Date - 2022-01-17T05:43:23+05:30 IST

ప్రగతిపథంలో పయనిస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ యోచన దుర్మార్గం
రిలే దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ

కూర్మన్నపాలెం, జనవరి 16: ప్రగతిపథంలో పయనిస్తున్న విశాఖ  స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని  ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 339వ రోజు కొనసాగాయి. ఆదివారం ఈ దీక్షలలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి ఆదినారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ విధానాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ దీక్షలలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు వై.సంజీవరావు, కె.సొమినాయుడు, వెంకటేశ్వర్లు, గోవిందరావు, నాగలింగం పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-17T05:43:23+05:30 IST