ఉక్కు కార్మికుల కుటుంబాలు నిరసన

ABN , First Publish Date - 2021-03-01T06:38:27+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ అక్కిరెడ్డిపాలెం ఉక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ఆదివారం అక్కిరెడ్డిపాలెంలో ఉక్కు కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులు నిరసన దీక్ష చేపట్టారు

ఉక్కు కార్మికుల కుటుంబాలు నిరసన
అక్కిరెడ్డిపాలెంలో నిరసన దీక్ష చేస్తున్న ఉక్కు కార్మికుల కుటుంబాలు

అక్కిరెడ్డిపాలెం, ఫిబ్రవరి 28: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ అక్కిరెడ్డిపాలెం ఉక్కు ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో ఆదివారం అక్కిరెడ్డిపాలెంలో ఉక్కు కార్మికులతో పాటు వారి కుటుంబసభ్యులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. తెలుగువారి మనోభావాలను కేంద్ర  ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రైవేటీకరణ అంశాన్ని ఉపసంహరించుకోకపోతే అందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో  ఉక్కు కార్మికులతో పాటు టీఎన్‌టీయూసీ నాయకులు బోడ్డు పైడిరాజు, వైసీపీ నాయకులు గుడివాడ అనూష, సండ్రాన నూకరాజు, గుడివాడ లతీష్‌, వరదాడ రమణ సీపీఎం  నాయకులు జి.సుబ్బారావు, టీడీపీ నాయకుడు శీరం రాజేష్‌, జనసేన నాయకులు గవర రోహిణి తదితరులు పాల్గొని తమ సంఘీబావం ప్రకటించారు.


Updated Date - 2021-03-01T06:38:27+05:30 IST