Abn logo
Sep 22 2021 @ 00:58AM

ఉక్కు సంకల్పం

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌కు మద్దతుగా మంగళవారం జింక్‌ గేటు నుంచి కూర్మన్నపాలెం ఆర్చ్‌ వరకు సీపీఐ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు బినోయ్‌ విశ్వం, మరో జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ,  సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, కార్మిక సంఘాల నేతలు అయోధ్యరామ్‌, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, కేంద్రం మొండి వైఖరి విడనాడాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు.

-గాజువాక/కూర్మన్నపాలెం