హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రికార్డు

ABN , First Publish Date - 2022-02-22T01:51:55+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం ఉత్పత్తిలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ఆదివారం ఉదయం ఆరు నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల

హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ రికార్డు

విశాఖ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ఫర్నేస్‌ విభాగం ఉత్పత్తిలో ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ఆదివారం ఉదయం ఆరు నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు (ఒక్క రోజులో) బ్లాస్ట్‌ఫర్నేస్‌- 1 (గోదావరి), బ్లాస్ట్‌ఫర్నేస్‌-2 (కృష్ణ) విభాగాల్లో 15,440 టన్నుల హాట్‌మెటల్‌ ఉత్పత్తి జరిగింది. ఇది ప్లాంట్‌ చర్రితలో రికార్డు. ఈ నెల 12న ఈ విభాగాల్లో 15,233 టన్నుల ఉత్పత్తి జరగ్గా, తాజాగా ఆ రికార్డును అధిగమించింది.

Updated Date - 2022-02-22T01:51:55+05:30 IST