ఉక్కు ప్రైవేటీకరణ తగదు

ABN , First Publish Date - 2022-05-23T05:08:48+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు కేఎస్‌ఎన్‌ రావు కోరారు.

ఉక్కు ప్రైవేటీకరణ తగదు
రిలే దీక్షల శిబిరంలో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు కేఎస్‌ఎన్‌ రావు

కూర్మన్నపాలెం, మే 22: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు కేఎస్‌ఎన్‌ రావు కోరారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 465వ రోజు కొనసాగాయి. ఆదివారం ఈ దీక్షలలో  పాల్గొన్న బ్లాస్ట్‌ఫర్నేస్‌ కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఐక్య ఉధ్యమాలతోనే కార్మికులకు విజయాలు నమోదవుతాయన్నారు. 1966లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు కర్మాగారం స్థాపించాలని, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2021లో  అసెంబ్లీలో  తీరానాలు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి విలువనివ్వాలని కోరారు. పోరాట కమిటీ మరో నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐదు దశాబ్దాలుగా లాభాలలో ఉన్న ఉక్కు కర్మాగారానికి నేటివరకు సొంత గనులు కేటాయించకుండా కేంద్ర ప్రభుత్వం తప్పిదానికి పాల్పడిందని ఆరోపించారు. పరిరక్షణ పోరాట కమిటీ నేతలు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్‌, విళ్ల రామ్మోహన్‌ కుమార్‌, గంధం వెంకటరావు, గంగవరం గోపి, మురళీ రాజు, వేములపాటి ప్రసాద్‌, కొమ్మినేని శ్రీనివాసరావు, సుబ్బయ్య, జె.రామకృష్ణ, మసేను, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2022-05-23T05:08:48+05:30 IST