స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి: మంత్రి అవంతి

ABN , First Publish Date - 2022-02-05T00:50:30+05:30 IST

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని మంత్రి

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి: మంత్రి అవంతి

విశాఖ: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని మంత్రి అవంతి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.  గాజువాక నియోజకవర్గపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు14 సమస్యలపై మూడు గంటల పాటు చర్చించామన్నారు. గంగవరం పోర్టులో ఉపాధి, కాలుష్య సమస్య, ఇళ్ల పట్టాలతో సహా పలు అంశాలపై చర్చించామన్నారు.


గాజువాక నియోజకవర్గంపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని ఆయన పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని సీఎం జగన్ ఇప్పటికే రెండుసార్లు కేంద్రానికి లెటర్ రాశారని, అసెంబ్లీలో కూడా తీర్మానం చేశామని ఆయన తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలన్నారు. కార్మికుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. గాజువాక నియోజకవర్గ సమీక్షా సమావేశానికి ప్రతిపక్ష కార్పొరేటర్లను పిలవకుండా వైసీపీ కార్పొరేటర్లను, ప్రజాప్రతినిధులను మాత్రమే పిలవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2022-02-05T00:50:30+05:30 IST