రాష్ట్ర బంద్‌ విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-03-04T06:52:40+05:30 IST

విశాఖపట్నం స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మార్చి 5న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నేతలు, అఖిలపక్ష సంఘం నేతలు పిలుపు నిచ్చారు

రాష్ట్ర బంద్‌ విజయవంతం చేయండి

అవనిగడ్డ టౌన్‌, మార్చి 3 : విశాఖపట్నం స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మార్చి 5న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నేతలు, అఖిలపక్ష సంఘం నేతలు పిలుపు నిచ్చారు. స్థానిక ఎస్‌బీకే విజ్ఞాన భవనంలో  బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.  అందరూ ఐక్యంగా పోరాడి విశాఖ ఉక్కు ప్రైవేట్‌ పరం కాకుండా చూడా లన్నారు. విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రముఖ న్యాయవాది పర్చూరి రాఘవేంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశం లో మాజీ జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ నేత ఆది రామ్మోహనరావు, ఏపీ రైతు కార్యచరణ కమిటీ అధ్యక్షులు వంగల సుబ్బారావు, జనసేన నేత రాయపూడి వేణుగోపాలరావు, వామపక్ష నేత తలశిల లీలామనోహర్‌, మద్దాల బాలస్వామి, నడకుదుటి సీతారామాంజనేయులు పాల్గొన్నారు. 

 మోపిదేవిలో రౌండ్‌ టేబుల్‌

మోపిదేవి  : విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ  5వ తేదీన చేపట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు. సీపీఎం కార్యాలయంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు.  సీఐటీయూ డివిజన్‌ నాయకులు బండి ఆదిశేషు మాట్లాడుతూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తలమానికంగా ఉన్న ఉక్కు కర్మాగారం ప్రైవేటీ కరణ చేయటం బీజేపీ ప్రభుత్వ కుట్రకు నిదర్శన మన్నారు.  బంద్‌ను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.  రైతు సంఘం కార్యదర్శి కాలారి రామారావు, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు కోసూరు రామాంజనేయులు, ప్రజాసంఘాల నాయకులు సీహెచ్‌. రాజశేఖర్‌, మద్దాల వెంకటేశ్వరరావు, కొమ్ము జయరావు, కళ్లేపల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు. 

గుడివాడలో పరిరక్షణ కమిటీ పిలుపు

 గుడివాడ టౌన్‌ : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాననిఇ్న కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ ఈనెల 5వ తేదీన జరుగనున్న రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు.  ఎన్జీవో హోంలో బుధవారం బంద్‌ వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ నాయకులు గన్నవరం డిగ్రీ కళాశాల రిటైర్డ్‌ కామర్స్‌ హెడ్‌ దండమూడి సీతారా మస్వామి మాట్లాడుతూ  విశాఖ ఉక్కు సామర్థ్యాన్ని కార్మికులు చెమటోడ్చి అభివృద్ధి చేస్తే కారు చౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దారుణ మన్నారు. ఉక్కు సంకల్పంతో ప్రజలంతా పార్టీలకతీతంగా ఏకతాటి పైకి తెచ్చి స్టీలు ఫ్యాక్టరీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఆర్‌సిపి.రెడ్డి మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు, వ్యాపార, ఉద్యోగ, కార్మిక సంఘాలు బంద్‌కు మద్ధతు ఇచ్చి విజయవంతం చేయాలని కోరారు.   అమరుల స్ఫూర్తితో పోరాటాన్ని ఉధృతం చేద్దామని పరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు గూడపాటి ప్రకాష్‌బాబు అన్నారు. పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

ఘంటసాలలో రౌండ్‌టేబుల్‌ సమావేశం

ఘంటసాల  : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఈ నెల 5వ తేదీన చేపట్టిన రాష్ట్ర వ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు పిలుపునిచ్చారు.  ఘోటకం కాలనీలోని ఏఎస్‌ఎం భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.  నేతలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరం చేసి పర్మినెంట్‌ ఉద్యోగుల పొట్ట కొట్టాలని చూస్తుందన్నారు. 32 మంది  బలిదానంతో పోరాడి సాఽధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్‌ పరంగా చేయటాన్ని ప్రతి ఒక్కరూ నిరసించాలన్నారు.  బంద్‌ వాల్‌ పోస్టర్లను నేతలు ఆవిష్కరించారు.  పరిరక్షణ పోరాట వేదిక కమిటీ సభ్యులు వాకా రామచంద్రరావు, గొర్రెపాటి వెంకట రామకృష్ణ, అందె జగదీష్‌, జక్కా కేశవరావు, భలే రమేష్‌, గుత్తికొండ సత్యనారాయణ, తాడిపర్తి ఆనందరావు, భట్టు రామసుబ్బారావు, ఇశ్రాయేలు, వెనిగళ్ల నాగమణి తదితరులు పాల్గొన్నారు. 

 బంటుమిల్లిలో

బంటుమిల్లి :   విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ 5న జరిగే బంద్‌ విజయవంతం చేయాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. బంటుమిల్లిలోని గుండాబత్తుల ఆంజనేయులు స్మారక భవనంలో బంద్‌ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రజా సంఘాలనాయకులు బొల్లా వెంకన్న, జొన్నలగడ్డ కొండ, గౌరిశెట్టి నాగేశ్వరరావు, మాజేటి శివ శ్రీనివాసరావు, ధనశ్రీ, రత్నకుమారి, బొడ్డునాగరాజు పాల్గొన్నారు. బంటుమిల్లి :  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ 5న జరిగే బంద్‌ విజయవంతం  చేయాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. బంటుమిల్లిలోని గుండాబత్తుల ఆంజనేయులు స్మారక భవనంలో బంద్‌ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.  ప్రజా సంఘాలనాయకులు బొల్లా వెంకన్న, జొన్నలగడ్డ కొండ, గౌరిశెట్టి నాగేశ్వరరావు, మాజేటి శివ శ్రీనివాసరావు, ధనశ్రీ, రత్నకుమారి, బొడ్డునాగరాజు  పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-04T06:52:40+05:30 IST