విజయం సాధించే వరకూ ఉక్కు ఉద్యమం

ABN , First Publish Date - 2021-07-25T05:46:54+05:30 IST

విజయం సాధించే వరకూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ అన్నారు.

విజయం సాధించే వరకూ ఉక్కు ఉద్యమం
రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్న ఉక్కు ఉద్యోగులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌

కూర్మన్నపాలెం, జూలై 24: విజయం సాధించే వరకూ ఉక్కు పరిరక్షణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ అన్నారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే దీక్షలు 163వ రోజు కొనసాగాయి. శనివారం ఈ దీక్షలలో  ఐఎన్‌ఎస్‌టీ, క్యూఏటీడీ, డీఎన్‌డబ్ల్యూ, ఆర్‌అండ్‌డీ, డీఅండ్‌ఈ విభాగాల కార్మికులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉక్కు కర్మాగార పరిరక్షణకు ఆదివారం ఉక్కు నిర్వాసిత కాలనీల్లో నిర్వహించు పాదయాత్రలను విజయవంతం చేయాలని కోరారు. ఉక్కు పోరాట కమిటీ నాయకుడు పరందామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని కోరారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ కె.సత్యనారాయణ, ఇతర నాయకులు  వేములపాటి ప్రసాద్‌, గంగవరం గోపి, రామచంద్రరావు, నరేశ్‌, శ్రీను, రమణ, నాగేశ్వరరావు, రంగారావు, సూరిబాబు, సత్యానందం, రాము తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-25T05:46:54+05:30 IST