Viral News: తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్ రే చూసి తలలు పట్టుకున్న డాక్టర్లు.. వైరల్ అవుతున్న న్యూస్!

ABN , First Publish Date - 2022-10-03T22:24:48+05:30 IST

ఓ వ్యక్తి గత నాలుగు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా ఆ నొప్పి తీవ్రమైంది. దీంతో అతడు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లాడు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు డాక్టర్లకు చెప్పాడు. ఈ నేపథ్యంలో అక్కడి వైద్యులు.. అతడికి కొన్ని వైద్య చేయించారు. అనంతరం వచ్చిన ఎక్స్ రే రిపోర్టును చూసి వైద్యులు

Viral News: తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన వ్యక్తి.. ఎక్స్ రే చూసి తలలు పట్టుకున్న డాక్టర్లు.. వైరల్ అవుతున్న న్యూస్!

ఇంటర్నెట్ డెస్క్: ఓ వ్యక్తి గత నాలుగు నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. తాజాగా ఆ నొప్పి తీవ్రమైంది. దీంతో అతడు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లాడు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు డాక్టర్లకు చెప్పాడు. ఈ నేపథ్యంలో అక్కడి వైద్యులు.. అతడికి కొన్ని వైద్య చేయించారు. అనంతరం వచ్చిన ఎక్స్ రే రిపోర్టును చూసి వైద్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అతడి కడుపులో స్టీల్ గ్లాస్ ఉన్నట్టు గుర్తించి.. అవాక్కయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతూ స్థానికంగా ఉన్న ఆసుపత్రికి వెళ్లగా అతడిని పరీక్షించిన వైద్యులు అతడి పొట్టలో స్టీల్ గ్లాస్‌ను గుర్తించారు. అనంతరం అసలు విషయంపై అతడిని డాక్టర్లు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి నోరు తెరిచాడు. నాలుగు నెలల క్రితం అంబావటా (Ambavata) గ్రామంలోని కొందరు వ్యక్తులు తనను బంధించి.. మలద్వారం ద్వారా స్టీల్ గ్లాసును కడుపులోకి చొప్పించినట్టు పేర్కొన్నాడు. భయం, సిగ్గు కారణంగా ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదన్నాడు. నాలుగు నెలలుగా కడుపు నొప్పిని భరిస్తున్నట్టు వెల్లడించాడు. అయితే తాజాగా నొప్పి తీవ్రం అవడంతో ఆసుపత్రికి వచ్చినట్టు వివరించాడు. పేషెంట్ చెప్పిన విషయం విని వైద్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇదిలా ఉంటే.. అతడి కడుపులోంచి స్టీలు గ్లాసును బయటకు తీయడానికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. కాగా.. కొద్ది రోజుల క్రితం ఒడిశాలో కూడా ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి.. తన స్నేహితుడి మలద్వారం ద్వారా పొట్టలోకి గ్లాసును చొప్పించాడు.


Updated Date - 2022-10-03T22:24:48+05:30 IST