అమరావతి: ఎస్ఈబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా నాటుసారాపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆపరేషన్ పరివర్తన్ 2.0 పేరుతో 16 రోజులుగా దాడులు చేస్తున్నారు. నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ దాడులు విస్తృతంగా చేస్తోంది. ఇప్పటివరకు 3,403 కేసులను నమోదు చేశారు. నాటుసారాతో సంబంధమున్న 2,006 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 44,058 లీటర్ల నాటుసారా, 155 వాహనాలను ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి