బిట్ కాయిన్ పై ఉక్కుపాదం...

ABN , First Publish Date - 2021-06-21T21:53:41+05:30 IST

ఎనర్జీ యూసేజ్ ఆందోళనల నేపధ్యంలో... బిట్ కాయిన్ మైనింగ్ పై చైనా సియాచిన్ ప్రావిన్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు.

బిట్ కాయిన్ పై ఉక్కుపాదం...

ముంబై : ఎనర్జీ యూసేజ్ ఆందోళనల నేపధ్యంలో... బిట్ కాయిన్ మైనింగ్ పై చైనా సియాచిన్ ప్రావిన్స్ అధికారులు ఉక్కుపాదం మోపారు. క్రిప్టోకు వ్యతిరేకంగా ఆందోళనలతో మైనింగ్ నిలిపివేత ప్రభావం బిట్ కాయిన్, ఇతర క్రిప్టోలపై పడింది. ఈ క్రమంలో... ఈ రోజు బిట్ కాయిన్ 1.17 శాతం క్షీణించి 35 వేల డాలర్ల దిగువకు పడిపోయింది. ఉదయం సెషన్‌లో 34,998 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. చైనా సియాచిన్ ప్రావిన్స్ సౌత్ వెస్ట్ ప్రావిన్స్ అధికారులు బిట్ కాయిన్ మైనింగ్ నిలిపివేతకు ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో... 90 శాతం చైనా బిట్ కాయిన్ మైనింగ్ నిలిచిపోనున్న పరిస్థితులేర్పడ్డాయి. 


అంతకుముందు టర్కీ నిర్ణయం, ఆ తర్వాత కొత్త బిట్ కాయిన్స్‌ను వెలికితీసే క్రిప్టో మైనింగ్ ప్రక్రియను చైనా నిలిపి వేయడం తదితర పరిణామాల నేపధ్యంలో బిట్ కాయిన్ విలువ పతనమవుతోంది. ఓ దశలో... 65 వేల డాలర్లకు చేరుకున్న బిట్ కాయిన్ ఇప్పుడు 35 వేల డాలర్ల దిగువన ట్రేడ్ అయింది. ఈ ప్రక్రియకు విద్యుత్తు వినియోగం అధికంగా ఉంటోన్న కారణంగా క్రిప్టోమైనింగ్ ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి.

Updated Date - 2021-06-21T21:53:41+05:30 IST