హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణంపై యథాతథస్థితి

ABN , First Publish Date - 2022-01-23T05:34:18+05:30 IST

స్థానిక హిందూ శ్మశాన వాటికలో అధికా రులు చేపట్టిన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణంపై హైకోర్టు యథాత థస్థితి కొనసాగించాలని తీర్పు ఇవ్వడంపై అఖిలపక్ష నాయకులు హర్షం వ్యక్తం చేశారు,

హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణంపై యథాతథస్థితి

- హైకోర్టు తీర్పుపై అఖిలపక్షాల హర్షం

పుట్టపర్తి,  జనవరి 22: స్థానిక హిందూ శ్మశాన వాటికలో అధికా రులు చేపట్టిన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ నిర్మాణంపై హైకోర్టు యథాత థస్థితి కొనసాగించాలని తీర్పు ఇవ్వడంపై అఖిలపక్ష నాయకులు హర్షం వ్యక్తం చేశారు, శనివారం స్థానిక హనుమాన్‌ కూడలిలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష నాయకుల సమావేశంలో హైకోర్టు తీర్పు కాపీలను ప్రదర్శిస్తూ ఇది ప్రజావిజయం అని నినాదాలు చేశారు. హిందూ శ్మశా న వాటికలో హెల్త్‌క్లినిక్‌ నిర్మాణం చేపట్టరాదన్న తమ నిరసనను అధికా రులు లెక్కచేయలేదన్నారు. అందుకే హైకోర్టుకు వెళ్లగా అత్యధిక ప్రజల మనో భావాలకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు.  అధికా రులు, ప్రజాప్రతి నిధులు బేషజాలు వీడి మరో ప్రాంతంలో హెల్త్‌క్లినిక్‌ నిర్మా ణం చేప ట్టాలని సూచించారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ ము రళీధర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ నరసింహులుకు వినతిపత్రం అం దచేశా రు. కార్యక్రమంలో నాయకులు తలమర్లహరికృష్ణ, జ్యోతిప్రసాద్‌, పీసీ గంగన్న, కొండమరాజు, బాలగంగాదర్‌, చింతా దామోదర్‌, బొగ్గరం శ్రీని వాసులు అబ్దుల్‌ తిరుపతేంద్ర రామాంజనేయులు, షామీర్‌, గంగి శెట్టి, పుట్లగం గాద్రి, మారుతి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-23T05:34:18+05:30 IST